YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట,లో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారని సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు..ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 1994 వ సంవత్సరంలో సమాజంలో ఉపాధ్యాయుల స్థాయి , గౌరవాన్ని పెంచేలా ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలని కోరింది, ఆధునిక సాధనాలు ఎన్ని ఉన్నా, బోధన సామాజిక మాధ్యమాల ద్వారా జరిగినా, ఉపాధ్యాయునికి అది ప్రత్యామ్నాయం కాదు అన్నారు, కంప్యూటర్ ఎప్పటికీ టీచర్ కాదు. అట్టి ఉపాధ్యాయుని గొప్పతనాన్ని గుర్తించిన యునెస్కో 1994 అక్టోబర్ 5ను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించిందని తెలిపారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులవలె ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, ప్రపంచ పోకడలు  నేర్చుకొని విద్యార్థులను భావి ప్రపంచ పౌరులుగా, ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొనే నేర్పరులుగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ సందర్భంగా రామానాయుడు అనే పేరెంట్ ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ గారిని శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, లక్ష్మయ్య, వెంకట రమణ, లక్ష్మీకాంత రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్,రాధ,మునిరాజు, మధుసూదనరెడ్డి,సురేష్, సుభాన్ బాషా, రాఘవేంద్ర, వెంకటలక్ష్మి, శ్రీకళ, దేవేంద్రప్ప,యం.ఏ.శ్రీనివాసులు, వై .శ్రీనివాసులు, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts