YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించిన భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్

ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించిన  భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్

న్యూడిల్లీ అక్టోబర్ 5
: ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్  ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించింది. సంక్లిష్ట భౌతిక వ్య‌వ‌స్థ‌ల‌పై మ‌న అవ‌గాహ‌న‌కు సంబంధించి వీళ్లు చేసిన ర‌చ‌న‌ల‌కుగాను ఫిజిక్స్ నోబెల్‌ను ప్ర‌క‌టించారు. స్యుకురో మ‌నాబె, క్లాస్ హాసెల్‌మాన్‌, గియోర్గియో పారిసిల‌కు ఫిజిక్స్ నోబెల్ ఇస్తున్న‌ట్లు రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. నోబెల్ బ‌హుమ‌తితోపాటు ఇచ్చే ప్రైజ్‌మ‌నీలో స‌గం పారిసికి, మిగ‌తా స‌గం మాన‌బె, హాసెల్‌మాన్‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు అకాడ‌మీ తెలిపింది.
ఈ ఏడాది వీరు  ఫిజిక్స్ నోబెల్ గెలిచిన పారిసి.. క్ర‌మ‌ర‌హిత సంక్లిష్ట ప‌దార్థాల‌లో దాగి ఉన్న న‌మూనాల‌ను క‌నుగొన్నారు. సంక్లిష్ట వ్య‌వ‌స్థ‌ల సిద్ధాంత ర‌చ‌న‌ల‌కు అత‌ని ఆవిష్క‌ర‌ణ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ తెలిపింది. ఇక వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కలిపే మోడ‌ల్‌ను సృష్టించిన క్లాజ్ హాసెల్‌మాన్‌ను కూడా ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ వ‌రించింది. మ‌నుషుల కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌వుతున్న కార్బ‌న్‌డైఆక్సైడ్ వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌ద్ధ‌తులు నిరూపిస్తున్నాయి.వాతావ‌ర‌ణంలో కార్బ‌న్‌డైఆక్సైడ్ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉప‌రిత‌ల ఉష్ణోగ్ర‌త‌లు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మ‌నాబెను కూడా ఈసారి ఫిజిక్స్ నోబెల్‌కు ఎంపిక చేశారు. ప్ర‌స్తుత ప‌ర్యావ‌ర‌ణ మోడ‌ల్స్‌ను రూపొందించ‌డానికి ఆయ‌న ర‌చ‌న‌లు ఓ ఫౌండేష‌న్‌లా ప‌ని చేసిన‌ట్లు స్వీడిష్ రాయ‌ల్ అకాడ‌మీ తెలిపింది.స్యుకురో మ‌నాబె.. జ‌పాన్‌లోని షింగు న‌గ‌రంలో 1931లో జ‌న్మించారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి 1957లో ఆయన పీహెచ్‌డీ పొందారు. అమెరికాలోని ప్రిన్స్‌స్ట‌న్ యూనివ‌ర్సిటీలో సీనియ‌ర్ మెటిరాలాజిస్ట్‌గా చేస్తున్నారు.క్లాస్ హాసెల్‌మాన్.. జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్‌లో 1931లో పుట్టారు. జ‌ర్మ‌నీలోని గొట్టిన్‌జెన్ వ‌ర్సిటీ నుంచి 1957లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. హాంబ‌ర్గ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెటిరాల‌జీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు.గియోర్గియో పారిసి.. ఇట‌లీ దేశంలోని రోమ్‌లో 1948లో జ‌న్మించారు. రోమ్‌లో ఉన్న సెపింజా యూనివ‌ర్సిటీ నుంచి 1970లో ఆయ‌న పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెపింజా వ‌ర్సిటీలోనే ప్రొఫెస‌ర్‌గా చేశారు.

Related Posts