YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

బ్రిటన్ లో విజృంభణ

బ్రిటన్ లో విజృంభణ

లండన్, నవంబర్ 9,
బ్రిటన్‌ ఇప్పటికి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఈ గందరగోళంలో మరో వైరస్ దేశంలో విజృంభిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన H5 బర్డ్ ఫ్లూ సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని పౌల్ట్రీ యూనిట్‌లో కనుగొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ  ధృవీకరించింది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లన్ని వార్విక్‌షైర్‌లోని ఆల్సెస్టర్ సమీపంలోని పౌల్ట్రీ ఫామ్‌లో ఉన్నాయి. ఈ వైరస్‌ని చంపే క్రమంలో పక్షులన్నిటిని చంపేస్తున్నారు.
గతంలో నార్త్ వేల్స్‌లోని ఒక వ్యక్తి ఇంట్లో ఉంచిన కోళ్లలో H5N1 నిర్ధారించారు. అదే సమయంలో తూర్పు స్కాట్లాండ్‌లోని ఫెన్సింగ్‌లో ఉంచిన కోళ్లలో, సెంట్రల్ ఇంగ్లండ్‌లోని బర్డ్ రెస్క్యూ సెంటర్‌లో కూడా H5N1 వైరస్‌ని కనుగొన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ గత కొన్ని వారాలుగా యూరప్ అంతటా విస్తరిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, డెన్మార్క్‌లలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే తాజా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికారులు జంతువులన్నింటిని ఇంటి లోపల ఉంచాలని ఆదేశించారు.ఈ శీతాకాలంలో వ్యాధి సోకిన వలస పక్షులతో సంబంధాన్ని నివారించడానికి రైతులు వలలు ఏర్పాటు చేసి వారి కోళ్ళను పరిమితం చేయాలని కోరారు. అక్టోబర్ 19 నుంచి ఇటలీలో ఆరు బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఫ్రెంచ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల పౌల్ట్రీ ఫామ్‌లను రక్షించడానికి కఠినమైన నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. కొత్త ఆంక్షల ప్రకారం.. పౌల్ట్రీలో క్రౌడింగ్, రేసింగ్ పావురాల పోటీలు మార్చి వరకు నిషేధించారు. జంతువులను, పక్షులను బంధించాలని లేదా టీకాలు వేయాలని ఆదేశించారు

Related Posts