YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యమునా నది ప్రక్షాళనకు అడుగులు

యమునా నది ప్రక్షాళనకు అడుగులు

యమునా నది ప్రక్షాళనకు అడుగులు
న్యూఢిల్లీ, నవంబర్ 13,
పుణ్యనదుల్లో ఒకటైన యమునా నదీ జలాలు కాలుష్యమయంగా మారాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండగా విషపు నురుగలు తేలియాడుతున్నాయి. అయినా దానిలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నదిని శుభ్రం చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. నురుగు తొలగించేందుకు 15 బోట్లు ఏర్పాటు చేశారు. కలింది కుంజ్ ప్రాంతంలో బోట్లతో నురుగును తొలగిస్తున్నారు.  మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో 'ఛఠ్ పూజ' వేడుకలు కొనసాగుతున్నాయి. ఇటు ఢిల్లీలోని కలింద్ కుంజ్ వద్ద యమునా నది ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయి. వాటిని కూడా లెక్కచెయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. యమునా నదిలో అమ్మోనియా స్థాయి పెరిగిందని ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. మరోవైపు 90 శాతం వ్యర్థ జలాలు యమునా నదిలోకి వెళ్తాయి. 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని కూడా యమునా నదిలో వదులుతున్నారు. మురుగు నీటిలో ఫాస్ఫేట్, ఆమ్లం ఉంటాయి. ఇది విషపూరిత నురుగుగా ఏర్పడటానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.

Related Posts