YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్

ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్

న్యూఢిల్లీ, నవంబర్ 16,
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం యుపి, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించింది. ఈ మూడు రాష్ట్రాలలోనూ పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలను మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని సంస్థలు ఇంటివద్ద నుంచి పని విధానంలో తమ కార్యకలాపాలు సాగించాలని సమావేశం సూచించింది. పరిశ్రమలు మూసి ఉంచాలని చెప్పింది. సమావేశం తరువాత, ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ప్రధాన కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిన్నటి నుండి పాఠశాలలు, కళాశాలలు మూసివేశామన్నారు. అదేవిధంగా నిర్మాణ పనులు నిషేధించామన్నారు. ఇక ఢిల్లీలో నిర్మాణ పనులు జరగడం లేదని నిన్న డీపీసీసీ బృందం అని చోటల్కు చోటకు వెళ్లి తేల్చింది.కాలుష్యంపై ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిందని గోపాల్ రాయ్ తెలిపారు. కోర్టు ఆదేశాల అనంతరం ఇవాళ యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మాదిరిగా ఎన్‌సీఆర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ను మూసివేయడం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేలా చూడాలనీ, అలాగే , పరిశ్రమలను మూసి ఉంచాలని ఢిల్లీ ప్రతిపాదించింది.
పెరుగుతున్న కాలుష్యం..
వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో 86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం.. ” గత రెండు వారాల్లో డాక్టర్ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండింతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి

Related Posts