
హైదరాబాద్, మే 21,
హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మెుత్తం 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసినా.. తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెసర్ పేలి పోవటం వల్లే మంటలు చెలరేగాయని అన్నారు. ఆ తర్వాత మంటలు క్షణాల్లోనే వ్యాపించినట్లు చెప్పారుచెక్కతో చేసిన మెట్లు, విద్యుత్ మీటర్ బోర్డు, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనాల సీటు కవర్లు, పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ కవటం వంటివి క్షణాల్లోనే జరిగిపోయాయని చెప్పారు. జీ+2 ఇంట్లో కింది అంతస్తులో నగల దుకాణం ఉండగా.. రెండో అంతస్తులో ఉన్న ఇంట్లో ప్రహ్లాద్ కుటుంబం నివాసం ఉంటుందని అన్నారు. మెుత్తం 10 గదులకు గాను.. 8 గదుల్లో ఏసీలు ఉన్నట్లు చెప్పారు. ఆ ఇంటికి సరైన వెంటిలేషన్ లేకపోవటంతో ఏసీల వినియోగం పెరిగిందని.. ఎండాకాలంలో ఏసీలను విపరీతంగా వాడడం, కంప్రెసర్లు సైతం ఇరుకు సందులోనే బిగించటంతో వాటిపై ఒత్తడి పెరిగి కంప్రెసర్ పేలినట్లు అధికారులు వెల్లడించారు. జీ+2 ఇంట్లో కింది అంతస్తులో ముత్యాల దుకాణం ఉంది. రెండో అంతస్తులో ప్రహ్లాద్ కుటుంబం నివాసం ఉంటుంది. మొత్తం 10 గదులు ఉన్నాయి. 7 గదుల్లో ఏసీలు ఉన్నాయి. ఆ ఇంటికి సరైన వెంటిలేషన్ లేకపోవటంతో ఏసీల వినియోగం పెరిగిందని.. ఎండా కాలంలో ఏసీలను విపరీతంగా వాడటం, కంప్రెషర్లు సైతం ఇరుకు సందులోనే బిగించటంతో వాటిపై ఒత్తిడి పెరిగి కంప్రెషర్ పేలినట్లు అధికారులు వివరించారు.ఇక ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను జూన్ 30వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది. కాగా, హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో ఇంత మంది మరణించటం ఇదే తొలిసారి. ఈ విషాదకర ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి.