YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెంచిన చార్జీల నుంచి 10 శాతం తగ్గింపు

పెంచిన చార్జీల నుంచి 10 శాతం తగ్గింపు

హైదరాబాద్, మే 21, 
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్, పెంచిన ఛార్జీల్లో 10 శాతం తగ్గింపుహైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం...టికెట్ల రేట్ల పెంపుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.తగ్గిన మెట్రో ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇటీవల కనీస ఛార్జీలను రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు మెట్రో రైల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
10 శాతం తగ్గింపు
మెట్రో ప్రయాణికులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోలో ప్రయాణిస్తున్న అల్పాదాయ ప్రజలపై భారం పడకూడదని పెంచిన ఛార్జీలపై 10శాతం తగ్గించినట్లు చెప్పారు.హైదరాబాద్ మెట్రో ఇటీవల ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వచ్చింది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు మెట్రో యాజమాన్యం పెంచింది.కొత్తగా సవరించిన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ తెలియజేసింది. మొత్తం మూడు మెట్రో కారిడార్లలో అన్ని ఛార్జీల్లో మే 24 నుంచి ఈ డిస్కౌంటు అమల్లోకి వస్తుంది. నిలకడగా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి పెడుతూ, ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో ముందుండటంలో మెట్రో రైలు నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు, అలాగే దీర్ఘకాలంలో మెట్రో కార్యకలాపాలను సుస్థిరంగా నిర్వహించేందుకు సమగ్ర వ్యూహంలో భాగంగా ఛార్జీలు సవరించామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. దూరదృష్టితో వ్యవహరిస్తూ, ప్రయాణికులకు అందుబాటు స్థాయిలో సేవలు అందించాలన్న నిబద్ధతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.“బాధ్యతాయుతమైన పట్టణ ప్రాంత ట్రాన్సిట్ ఆపరేటరుగా, హైదరాబాద్‌ వాసులకు సమర్ధవంతమైన, అందుబాటు స్థాయిలో మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించేందుకు మెట్రో రైల్ కట్టుబడి ఉంది. మెట్రో కార్యకలాపాలను నిలకడగా కొనసాగించేందుకు ఛార్జీలను సవరించక తప్పలేదు"- ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డిఅయినప్పటికీ ప్రయాణికులపై ఆర్థిక భారం పడనివ్వకుండా చూసేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ఇందులో భాగంగానే, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ తో కొత్తగా సవరించిన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అందుబాటు ఛార్జీల్లో రోజువారీ ప్రయాణాలకు వీలు కల్పించాలన్న మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది” -ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి
మూడు కారిడార్లలో
"2025 మే 24 నుంచి మొత్తం మూడు మెట్రో కారిడార్లలోని అన్ని ఛార్జీల జోన్ల వ్యాప్తంగా ఈ డిస్కౌంటు అమల్లోకి వస్తుంది. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రయాణికులకు కృతజ్ఞతలు” అని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ మెట్రో ఇటీవల ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వచ్చింది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు మెట్రో యాజమాన్యం పెంచింది.

Related Posts