YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భారత్ సహా మూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

భారత్ సహా మూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

న్యూఢిల్లీ
శుక్రవారం  తెల్లవారు జామున జంట భూకంపాలు సంభవించాయి. భారత్ సహా రెండు దేశాలను వణికించాయి. వాటి తీవ్రత అధికంగా ఉండటంతో  ఈ మూడు దేశాల సరిహద్దుల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల వల్ల కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు తెలియరావట్లేదు. ప్రధాన భూకంపం 5.15 గంటలకు  తరువాత ఒకసారి 5.53 గంటలకు కూడా స్వల్పంగా ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అధికారులు వెల్లడించారు. త్రిపురం, మణిపూర్, మిజోరం, అసోం రాష్ట్రాల్లో భూప్రకంపనలు నమోదయయ్యాయి.ముందు  బంగ్లాదేశ్లోని సరిహద్దుల్లోని చిట్టాగాంగ్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. చిట్టాగాంగ్ సిటీ  భారత్-మయన్మార్ సరిహద్దు రీజియన్ పరిధిలోకి వస్తుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో వుంది.  ఫలితంగా సునామీ ఆందోళనలు మొదట్లో వెలువడ్డాయి. సునామీ రావడానికి అవకాశం లేదంటూ యూరోపియన్ మిడ్టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. అయితే,  సునామీ సంభవించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Related Posts