YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ముంబై దాడుల‌కు పాకిస్థాన్ హై క‌మిష‌న్‌ దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ

ముంబై దాడుల‌కు పాకిస్థాన్ హై క‌మిష‌న్‌ దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ

న్యూఢిల్లీ నవంబర్ 26
2008, సెప్టెంబ‌ర్ 26వ తేదీన ముంబైలో ఉగ్ర‌వాదులు ర‌క్త‌పాతం సృష్టించిన దాడుల‌కు నేటితో 13 ఏళ్లు నిండాయి. ఆ ఘాతుకానికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదులను ప‌ట్టుకోవాల‌ని ఇవాళ పాకిస్థాన్‌ను ఇండియా కోరింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ హై క‌మిష‌న్‌లో ప‌నిచేస్తున్న దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ చేసింది. 26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసును త్వ‌ర‌గా విచారించాల‌ని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ముంబై దాడులు జ‌రిగే 13 ఏళ్లు గ‌డిచినా.. 166 మంది బాధిత కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం చెప్పింది. ఇవాళ కేంద్ర విదేశాంగ‌శాఖ ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డిన వారిని శిక్షించ‌డంలో పాకిస్థాన్ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు భార‌త విదేశాంగ శాఖ ఆరోపించింది. ద్వంద్వ వైఖ‌రిని పాకిస్థాన్ వీడాల‌ని భార‌త్ కోరింది. 26/11 ముంబై దాడుల దోషుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులు, అమ‌రులకు న్యాయం చేకూరే వ‌ర‌కు భార‌త్ ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తున్నంద‌ని విదేశాంగ శాఖ తెలిపింది.

Related Posts