YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సిరివెన్నల మృతి తీరని లోటు ప్రముఖుల సంతాపం

సిరివెన్నల మృతి తీరని లోటు ప్రముఖుల సంతాపం

హైదారాబాద్, డిసెంబర్ 1
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మూడున్నర దశాబ్దాల పాటు వెల్లివిరిసిన సిరివెన్నెల మాయమైంది. తెలుగు పాటకు వన్నె తెచ్చిన సీతారామశాస్త్రిగారు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన అకాల మరణం చెందారు. దీంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఆయన మరణాన్ని చాలామంది సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతోటి బంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సిరివెన్నెల అక్షరాల్లో ఆవేశం ఉంటుంది. అదే కలం నుంచి ప్రేమగీతాలు జాలువారుతాయి. చీకట్లోంచి వెలుగులోకి నడిపించే బాట వేస్తాయి. పాటలే కాదు మాటలు కూడా. వ్యక్తిత్వ వికాసం నేర్పుతాయి. నాటి తరానికి-నేటి తరానికి వారధిగా నిలిచిన తెలుగు సాహితీ ముద్దుబిడ్డ సిరివెన్నెల అకాల మరణం.. తెలుగు పాటకు తీరని లోటు.కాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు చెప్పారు. తనకు లంగ్ ఆపరేషన్ ఫిక్స్ అయినట్లు తెలియజేశారు. వాసు సనిమా రాయాల్సి ఉంది.. కానీ రెండు నెలలు రాయలేనన్నారు. డిసెంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాక పాట రాస్తానన్నారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాననే నమ్మకం కావొచ్చు.. తన ఆరోగ్య పరిస్థితిపై నవ్వుతూ సరదాగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన వెన్నెలలో కలిసిపోయారు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల మెగా స్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజని చిరంజీవి అన్నారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.మెగాస్టార్ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణంతో తన గుండె తరుక్కుపోతోందని, బరువెక్కిపోతోందని చిరు అన్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేరని చెప్పారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకానికి అన్యాయం చేశారని చెప్పారు.భౌతికంగా సిరివెన్నెల దూరమైన కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారని వెల్లడించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన అయినప్పుడు తను ఆయన మాట్లాడనని చిరు చెప్పారు
గూగుల్ నివాళి
హితీ సిరి దూరమైంది. వెన్నెల మటుమాయమైంది. సినీ జగత్తును ఓలలాడించిన లాలి పాట శాశ్వతంగా మూగబోయింది. పాటైనా.. మాటైనా ప్రశ్నించడంలోనే తనను వెతుక్కుంటూ సమాజాన్ని జాగృతం చేస్తూ వచ్చిన ఓ సినీదిగ్గజం రాలిపోయింది. తిరిగిరాని లోకాలకు పోయింది. పాటై ప్రశ్నించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ మనల్ని నిద్రలేపుతూ ఆయన శాశ్వత నిద్రలోకి పోయారు.
జగమంత తన కుటుంబాన్ని వదిలి.. సినీ అభిమానుల్ని ఏకాకులను చేసి ఆయన మాత్రం లోకాన్ని వీడారు. సిరివెన్నెల పాటలతో ఇంటిపేరు పెట్టుకున్నారు. సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. వేటూరిలా మెలోడీలతో ఆడించారు. శ్రీశ్రీ ను మరిపించేలా జాగృతం చేసే పాటలను అందించారు. సిరివెన్నెల పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత ఆయన.  3 దశాబ్ధాలు పాటల పూదోటలో ఒలలాడిన చిత్ర పరిశ్రమ..ఆయన మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ సిరివెన్నెల లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఆయన మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటంటూ చిన్నపిల్లల్లా తల్లిడిల్లిపోతున్నారు. ఓ తండ్రి లాండివారిని కోల్పోయామంటూ శోకసంద్రంలో మునిగిపోయారు.కాగా గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. “సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది.

Related Posts