YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్

బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్

హైదరాబాద్, డిసెంబర్ 2,
నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బాలయ్య బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అఖండ' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ జరుగుతుండగానే బోయపాటి రిలీజ్ చేసిన మూవీ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అనగా గత రాత్రి ఈ సినిమా ఓవర్‌సీస్‌లో ప్రదర్శించబడింది. పలుచోట్ల ప్రివ్యూ వేశారు. దీంతో ఇప్పటికే 'అఖండ' చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు బాలయ్య బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆడియన్స్ టాక్, ట్విట్టర్ పోస్టుల ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందని తెలుస్తోంది.ఫస్టాఫ్ ఫర్వాలేదని, మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి మార్క్ స్పష్టంగా చూపించారని అంటున్నారు. సెకండాఫ్‌లో అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను అద్భుతంగా మలిచారని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. బాల‌కృష్ణ-బోయ‌పాటి కల‌యిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాల‌న్నీ ప‌క్కాగా కుదిరిన ఇది అని అంటున్నారు.తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని, ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని ట్వీట్స్ పెడుతున్నారు. బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్ అంటున్నారు. అదిరిపోయే సీన్స్, నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ చూస్తూ ఆయన ఫ్యాన్స్ థియేటర్స్‌లో గోల పెట్టేశారట. మొత్తం మీద ఈ 'అఖండ' సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ ఇచ్చినట్లే అనే టాక్ అయితే బయటకొచ్చింది. మాస్ ఎలిమెంట్స్ కేకలు పెట్టించాయట. ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉన్నాయట. చిన్నారులు, దేవాల‌యాలు, దేవుడు, ప్రకృతి త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో అక్కడ‌క్కడా భావోద్వేగాలు పండిస్తూ బోయపాటి మ్యాజిక్ రిపీట్ చేశారని చెబుతున్నారు ఆడియన్స్.ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ నటించింది. బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు.
అఖండ హంగామా
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడు బోయపాటి. రిలీజ్  కు ముందు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది. తెల్లవారు జామునుంచే అభిమానుల హంగామా మొదలైంది.మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుందట. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అవ‌నుంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌నుంది. త‌మ‌న్ మ్యూజిక్‌, ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌. అంతే కాదు అఘోరాలు ఎందుకు అలా మారుతారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే దేవుడిని ఎందుకు నమ్మాలి అనే అంశాలను చూపించారట.

Related Posts