YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ‌తికే ఉన్న‌ బిపిన్ రావ‌త్... మిలిట‌రీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స

బ‌తికే ఉన్న‌ బిపిన్ రావ‌త్... మిలిట‌రీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స

బ‌తికే ఉన్న‌ బిపిన్ రావ‌త్... మిలిట‌రీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స
చెన్నైడిసెంబర్ 8
ప్ర‌మాదానికి గురైన‌ హెలిక్యాప్ట‌ర్‌లో ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్ బ‌తికే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, ప్ర‌మాదంలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళ‌నాడులోని వెల్లింగ్ట‌న్‌లోగ‌ల మిలిట‌రీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స పొందుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల 41 నిమిషాల స‌మ‌యంలో బిపిన్‌రావ‌త్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్న హెలిక్యాప్ట‌ర్ చెట్టును ఢీకొట్టి కూలిపోయింది.ఈ ఘ‌ట‌న‌లో హెలిక్యాప్ట‌ర్ మంట‌ల్లో కాలి బూడిదైపోయింది. దాంతో అందులోని 11 మంది స‌జీవ ద‌హ‌నం అయిపోయారు. కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే రెస్క్యూ బృందాలు ర‌క్షించ‌గ‌లిగాయి. అయితే, రావ‌త్‌తోపాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మిగ‌తా ఇద్ద‌రు ఎవ‌రనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్ర‌మాదానికి గురైన హెలిక్యాప్ట‌ర్‌లో రావ‌త్ కుటుంబ‌స‌భ్యులు, సిబ్బంది ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Related Posts