YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శిల్పా చౌదరీకి బిగిస్తున్న ఉచ్చు

శిల్పా చౌదరీకి బిగిస్తున్న ఉచ్చు

హైద్రాబాద్, డిసెంబర్ 10,
మాయగత్తె శిల్పాచౌదరి చెప్పేవి నిజాలా? లేక రాధికారెడ్డి చెబుతున్న మాటలు నిజమా? ఎవరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు? వందల కోట్ల రూపాయలు ఎవరెవరి మధ్య చేతులు మారాయ్? అధిక వడ్డీల కోసం శిల్పను వేధించిందెవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే పనిలో పడ్డారు నార్సింగి పోలీసులు. ఇంతకుముందు రెండ్రోజుల కస్టడీకి తీసుకుని శిల్పని ప్రశ్నించిన నార్సింగి పోలీసులు.. మరోసారి ఇంటరాగేట్‌ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు ఆమెను ప్రశ్నించనున్నారు. శిల్ప ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకుంది? ఎవరికి ఇచ్చింది? ఈ కోణంలో శిల్ప విచారణ సాగనుంది. అధిక వడ్డీల కోసమే తనకు డబ్బులిచ్చారంటోంది శిల్ప. అధిక వడ్డీల కోసం తనను ప్రియదర్శిని, రోహిణి వేధించారని చెబుతోంది. 2016 నుంచి నెలకు 5లక్షల రూపాయల చొప్పున వడ్డీలు చెల్లించానంటోంది శిల్ప. అందుకు, ఆధారాలు కూడా ఇచ్చింది శిల్ప. అధిక వడ్డీల కోసం వాళ్లు తనకు డబ్బులిస్తే తాను రాధికారెడ్డి ఇచ్చానంటోంది శిల్ప. కానీ, శిల్ప చెప్పేవన్నీ అబద్ధాలంటోంది రాధిక. శిల్ప తనకు డబ్బులివ్వలేదని, తానే ఆమె చేతిలో మోసపోయానని చెబుతోంది. దాంతో, వీళ్లిద్దర్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించేందుకు నార్సింగి పోలీసులు రెడీ అవుతున్నారు.కొత్తగా తెరపైకి వచ్చిన కొంపల్లి మల్లారెడ్డి, ఎన్నారై ప్రతాప్‌రెడ్డి పాత్రపైనా ఇంటరాగేషన్ జరగనుంది. రాధికారెడ్డి మధ్యవర్తిత్వంతో ఎన్నారై ప్రతాప్‌రెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చినట్లు శిల్ప చెబుతోంది. దాంతో, కొంపల్లి మల్లారెడ్డిని కూడా ఇవాళ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.ఫైనల్‌గా, శిల్ప కిట్టీ పార్టీస్‌పైనా కూపీ లాగనున్నారు పోలీసులు. ఒక్కో కిట్టీ పార్టీకి ఐదు కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో… అసలంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టేది? ఎవరెవరు అటెండ్ అయ్యేవారు? శిల్పా సిగ్నేచర్ విల్లా కేంద్రంగా అసలేం జరిగేది? కేవలం కిట్టీ పార్టీలేనా? ఇంకేదైనా జరిగేదా? అనే కోణంలో విచారణ చేయనున్నారు.

Related Posts