YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మళ్లీ అగ్రరాజ్యానికి ఒమిక్రాన్ టెన్షన్

మళ్లీ అగ్రరాజ్యానికి  ఒమిక్రాన్ టెన్షన్

న్యూయార్క్, డిసెంబర్ 11,
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. కరోనా ముందు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సైతం మోకరిల్లిక తప్పలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందని. అయితే భారత్‌ కూడా కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని ఎంతో విలవిలలాడింది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే కరోనా డెల్టా వేరియంట్‌ సృష్టించిన సెకండ్‌ వేవ్‌తో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. డెల్టా వేరియంట్‌ నుంచి ఇప్పడిప్పుడే భారత్‌ బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఇప్పుడు మరో సమస్యగా తయారైంది.డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో ఆయా దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ విజృంభన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మొదటగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌ ఇలా రోజు రోజు పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.గతంలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందినప్పుడు కరోనా నిర్థారణకై నిర్వహించే ర్యాపిడ్‌ టెస్టులు, ఆర్‌పీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌ ను నెగిటివ్‌గా, నెగిటివ్‌ను పాజిటివ్‌గా ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఎక్కవ శక్తివంతంగా ఉన్న క్రమంలో ఇలా అరకోరగా టెస్టులు చేసి ఒమిక్రాన్‌ వ్యాప్తికి కారణం అవుతారనే భయం కూడా ప్రజల్లో లేకపోలేదు. కాన్పూర్‌కు చెందిన ఐఐటీ ప్రొఫెసర్‌ భారత్‌లో థర్డ్‌వేవ్‌ తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ వస్తే భారత్‌ ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Related Posts