YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తెలుగు రాష్ట్రాల్లో పాగాకు పావులుకదుపుతున్న బిజెపి

తెలుగు రాష్ట్రాల్లో పాగాకు పావులుకదుపుతున్న బిజెపి

న్యూ ఢిల్లీ డిసెంబర్ 15
వచ్చే ఎన్నికల్లో ఉత్తరాది షాక్ ఇవ్వడం ఖాయమని తేలుతున్న వేళ దక్షిణాదిలో అది కూడా తెలుగు స్టేట్స్ లో ఏదో విధంగా బలం పెంచుకోవాలని బీజేపీ హై కమాండ్ చూస్తోంది.ఏపీలో పొత్తులతో డబుల్ డిజిట్ సీట్లు తెచ్చుకుంటే తెలంగాణాలో సింగిల్ గానే పోటీ చేసి డబుల్ డిజిట్ ని సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఇక అధికారంలో ఉన్న కర్నాటకలో ఈసారి ఎంపీ సీట్లు తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి.కేరళలో బోణీ కొట్టాలని తమిళనాడులో కూడా ఒక్క సీటు అయినా గెలవాలని కాషాయధారుల తాపత్రయంగా ఉంది. అయితే సౌత్ లో ఉన్న మొత్తం అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి కర్నాటకను పక్కన పెడితే ఆశలు పెంచేవి ఏవైనా ఉంటే అవి తెలుగు స్టేట్స్ గానే ఉన్నాయి. దాంతో మోడీ సౌత్ స్టేట్స్ కి చెందిన బీజేపీ ఎంపీలతో అతి కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు.ఈ భేటీ అంతా మిషన్ 2024 మీదనే సాగుతుంది అంటున్నారు. ముచ్చటగా మూడవసారి కేంద్రంలో అధికారం పట్టాలీ అంటే సౌత్ నుంచే సీట్లు ఎక్కువగా తెచ్చుకోవాలి అన్నది బీజేపీ వ్యూహంగా ఉంది.ఇక్కడ ఉన్న అయిదు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం 119 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో కనీసం మూడవ వంతుకు పైగా సీట్లు సాధించినా ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీకి గొప్పే అంటున్నారు. అయితే బీజేపీ సగానికి సగం సీట్ల కోసం బీజేపీ వేట మొదలెడుతోంది.అంటే ఎటునుంచి ఎటు పరిస్థితులు మారినా కూడా హాఫ్ సెంచరీ సీట్లు తేవాల్సిందే అన్నది బీజేపీ పంతంగా కనిపిస్తోంది. ఆ విధంగా కనుక ఆలోచిస్తే తమిళనాడులో అన్నా డీఎంకే తో కలసి ఉన్న బీజేపీ అవసరం అనుకుంటే శశికళతో సొంత పార్టీ పెట్టించడం చేసినా ఆమెతో పొత్తు పెట్టుకుని అక్కడ రాజకీయాన్ని మార్చాలని చూస్తోందిట.ఇక కేరళలో కొరుకుడుపడని రాజకీయాన్ని కూడా చేదించి ఏదోలా అయినా అక్కడ గెలిచి తీరాలనుకుంటోంది. ఇక కర్నాటకలో 28 ఎంపీ సీట్లు ఉన్నాయి.అందులో నుంచి మెజారిటీ సీట్లు తమ పరం చేసుకుంటే తప్ప కేంద్రంలో హ్యాట్రిక్ విజయం దఖలు పడదు అన్న అంచనాలు బీజేపీకి ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే తెలంగాణాలో ఉన్న 17 ఎంపీలలో పది దాకా ఈసారి గెలవాలన్నది టార్గెట్ గా పీట్టుకున్నారని టాక్.ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కనీసం సొంతంగా పది సీట్లు గెలవాలన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఆలోచనలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయనే చెప్పాలి. ఏపీలో అధికార వైసీపీ మీద మరింత ధాటీగా పోరాటం చేయలని కూడా డిసైడ్ అయ్యారని టాక్.అదే టైమ్ లో కేసీయార్ ని కూడా తెలంగాణాలో ధీటుగా ఎదుర్కోని వీలైతే అక్కడ ప్రభుత్వాన్నే స్థాపించాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్. మొత్తానికి ఉత్తరాది హ్యాండ్ ఇస్తున్న వేళ బీజేపీని ఆదుకోవాల్సింది సౌత్ మాత్రమే. అందునా తెలుగు స్టేట్స్. దాంతో బీజేపీ దూకుడు రాజకీయం ఇక్కడ తొందరలోనే స్టార్ట్ కాబోతోంది అని అంటున్నారు.తెలుగు రాష్ట్రాలు ఎపుడూ చిక్కేది లేదు దక్కేది లేదు అంటున్నాయి. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి మొత్తం 42 సీట్లు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు ఎంపీలు మించి ఎపుడూ దక్కలేదు.మరీ ముఖ్యంగా పొత్తు లేకుండా ఉంటే ఏపీలో ఠికానా కూడా కమలానికి లేదు అన్నది 2019 ఎన్నికలు నిరూపించాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని మోడీ అమిత్ షా గట్టిగానే నిర్ణయించుకున్నారు.

Related Posts