YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

న్యూ ఇయర్ పై ఒమిక్రాన్

న్యూ ఇయర్ పై ఒమిక్రాన్

హైదరాబాద్, డిసెబర్ 20,
ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతీ ఏడాది నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్, పార్టీలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అని సర్కార్ డైలమాలో ఉన్నది. పార్టీలు, బార్లు, పబ్ లు, స్టార్ హోటళ్లు, ఫంక్షన్ హాల్స్లో పెద్ద ఎత్తున ఏర్పడే జనసమూహాలతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను గమనిస్తే కూడా మరో ముప్పు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలతో పాటు అధికారులూ భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అంతేగాక క్రిస్మస్, సంక్రాంతి పండుగ వేడుకలకూ గ్రూప్ గేదర్స్ కట్టడి చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు, వైద్యశాఖ హెచ్ఓడీలు, ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. వివిధ శాఖలు, విభాగాలు వారీగా కరోనా పరిస్థితులు, ముందస్తు, కట్టడి చర్యలు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక్కో శాఖ నుంచి గవర్నమెంట్కు నివేదిక వెళ్లనున్నది. దాని ఆధారంగా న్యూ ఇయర్, ఇతర పార్టీలు, ఫంక్షన్లు, జనసముహాల కార్యక్రమాల నియంత్రణ దిశగా సర్కార్ అడుగులు వేయనున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ కీలక అధికారి చెప్పారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఏకంగా ఆరు రెట్లు అదనంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గత ఏడాదిలానే ఆంక్షలు విధిస్తే బెటర్ అని కొందరు ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అభిప్రాయాలను సర్కార్ కు వివరించినట్లు ఓ అధికారి తెలిపారు. గత సంవత్సరం లానే డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వకుండా కట్టడి చేస్తే వ్యాప్తిని తగ్గించవచ్చని సీనియర్ డాక్టర్లు, సైంటిస్టులు కూడా ప్రభుత్వానికి అంతర్గతంగా చెప్పినట్లు తెలుస్తోన్నది. దీంతో  ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. మరోవైపు డిసెంబరు 31న రాత్రి మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపితే కూడా కొంతవరకు మేలు జరుగుతుందని మరి కొంతమంది అధికారులు ఇటీవల సెక్రటేరియట్ లో జరిగిన ఉన్నతాధికారుల మీటింగ్లో అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రాథమికంగా ఆంక్షలు విధించే వైపే సర్కార్ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కానీ ఆంక్షలు విధిస్తే కేవలం హైదరాబాద్కే పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోన్నది

Related Posts