YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

70 ప్లస్ వారికే కరోనా గండం

70 ప్లస్ వారికే కరోనా గండం

ముంబై, జనవరి 25,
రెండేళ్ళ క్రితం చైనా లో పుట్టి.. ప్రపంచ దేశాల్లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా జనాభాను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. వివిధ వేరియంట్స్ రూపంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ విజృంభిస్తోంది. అయితే కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ అల్లకల్లోలం సృష్టించింది. భారత దేశంలో కూడా కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో భారీగాస్ కేసులు నమోదయ్యాయి. మృతులు సంఖ్య కూడా భారీగానే ఉందని పనులు నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజాగా థర్డ్ వేవ్.. లో ఒమిక్రాన్ వేరియంట్ కూడా దేశంలో అడుగు పెట్టింది. మళ్ళీ రోజుకు రెండు నుంచి మూడు లక్ష్జల కేసులు నమోదవుతున్నాయి, అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. థర్డ్‌వేవ్‌లో దేశంలో మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.దేశంలో మూడో దశలో కరోనా వ్యాపిస్తోంది. అయితే బాధితుల్లో మరణించినవారిలో అధికంగా వృద్దులు ఉన్నారని.. 60శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోవారు ఉంటె మరికొందరు సింగిల్ డోసు తీసుకున్నవారు ఉన్నారని మాక్స్‌ హెల్త్‌కేర్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మరణాలు ఎక్కువగా 70 ఏళ్లు పైబడిన వారిలో నమోదయ్యాయని కరోనా తో పాటు కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌లు మొదలైన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయని అధ్యయనం నివేదించింది. మహమ్మారి యొక్క మూడవ వేవ్ సమయంలో 23.4% మంది రోగులకు మాత్రమే ఆక్సిజన్ మద్దతు అవసరమని పేర్కొంది.కొవిడ్ మహమ్మారి మూడో దశలో 23.4శాతం మంది మాత్రమే ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందారని.. అదే రెండో వేవ్‌లో 74శాతం మందికి, మొదటి దశలో 63 శాతం మందికి ఆక్సిజన్ అవసరమైనదని పేర్కొంది. గత ఏప్రిల్‌లో రెండవ వేవ్‌లోసమయంలో ఢిల్లీలో 28,000 కేసులు నమోదు అయ్యాయని.. ఆ సమయంలో అన్ని హాస్పిటల్ బెడ్‌లతో పాటు ఐసియులో కూడా బెడ్స్ కూడా ఖాళీ లేవని .. అయితే థర్డ్ వేవ్‌లో గత వారం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు.. ఆసుపత్రిలో బెడ్స్ విషయంలో ఎటువంటి కొరత ఏర్పడలేదని మ్యాక్స్ ఆసుపత్రి తెలిపింది. మొదటి, రెండవ, మూడవ దశల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య వరుసగా 20,883, 12,444 , 1378గా ఉందని నివేదిక పేర్కొంది. గత 10 రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ … ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు వివరించింది. శుభవార్త ఏమిటంటే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉందని.. తేలికపాటి వ్యాధికి కారణమవుతున్నట్లు కనిపిస్తోంది” అని తెలిపింది. మాక్స్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా.సందీప్‌ బుద్ధిరాజా ఆధ్వర్యంలో.. కరోనా మొదలైనప్పటి నుంచి ఈ జనవరి 20వ తేదీ వరకు సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

Related Posts