YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జీవో నెంబర్ 77 రద్దు చేయాలి

జీవో నెంబర్ 77 రద్దు చేయాలి

నూజివీడు
పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగించాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నూజివీడు కూరగాయల మార్కెట్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) ఆధ్వర్యంలో చేపలు కూరగాయలు కొత్తిమీర అమ్ముతూ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ (ఐసా) నూజివీడు నియోజకవర్గ అధ్యక్షుడు పగుట్ల కుమార్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 వల్ల డిగ్రీ పూర్తిచేసి  పీజీ కోర్సులు చేద్దామన్నా విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి ఫీజులు కట్టుకోలేక డిగ్రీతో ఆపేసి కూలి పనులు చేసుకుంటూ జీవితం సాగించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరోపక్క ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పంచడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుని జాబులు కొట్టాలని ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి  ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం దుర్మార్గమని వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేనిపక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విద్యార్థులందరినీ వ్యక్తం చేస్తూ ఉద్యమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నూజివీడు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రవీంద్ర బాబు, కాజా నవీన్, నాయకులు హుస్సేన్, ప్రవీణ్, పండు, జ్యోతి కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

Related Posts