YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాక్‌కు భారీగా ఆయుధాలు పంపుతున్న చైనా

పాక్‌కు భారీగా ఆయుధాలు పంపుతున్న చైనా

న్యూ ఢిల్లీ జనవరి 27
ఆయుధాల విషయంలో భారత దేశంతో సరిసాటిగా పాకిస్థాన్‌ను నిలపాలని చైనా తహతహలాడుతోంది. భారత దేశ రాకెట్ లాంఛర్లు, హోవిట్జర్ శతఘ్నులను దీటుగా ఎదుర్కొనేందుకు వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లు,నోరింకో ఏఆర్ -1 300 ఎంఎం మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్లను సరఫరా చేస్తోంది. దాదాపు 512 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా ఇప్పటికే మొదటి దఫా చైనీస్ తయారీ వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లు పాక్‌కు చేరుకున్నాయి. భారత దేశం వద్ద ఉన్న కే-9 వజ్ర హోవిట్జర్లను ఎదుర్కొనేందుకు చైనీస్ తయారీ వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లను చైనా సరఫరా చేస్తోంది. భారతీయ రాకెట్ లాంఛర్లను ఎదుర్కొనేందుకు నోరింకో ఏఆర్ -1 300 ఎంఎం  మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్లను సరఫరా చేస్తోంది. భారత్ తాజాగా రష్యా నుంచి సేకరించిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఎదుర్కొనేందుకు డీఎఫ్-17 హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థను సరఫరా చేయడానికి చైనా మొగ్గు చూపుతోంది. అదేవిధంగా సంప్రదాయ ఆయుధ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, విధ్వంసకారులను సరఫరా చేస్తోంది. ఈ ఆయుధాల సరఫరా వెనుక చైనా అసలు లక్ష్యం  భారత్-పాక్ మధ్య శాశ్వత శత్రుత్వం కొనసాగాలన్నదేనని విశ్లేషకులు చెప్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధ దేశంగా మారడంలో చైనా పాత్ర చాలా ఉందని, ఆయుధ వ్యవస్థలను రహస్యంగా సరఫరా చేస్తోందని, 1990వ దశకం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ నమోదై ఉన్నాయని అంటున్నారు. చైనా వ్యూహం ఫలిస్తోందని కూడా చెప్తున్నారు. భారత్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించవలసి వస్తోందని అంటున్నారు.

Related Posts