YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

చర్చలకు రండి

చర్చలకు రండి

విజయవాడ, జనవరి 27,
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హా దారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్క‌డో కూర్చుని మాట్లాడితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం రాద‌న్నారు. స‌మ్మెకు వెళ్ల‌డం సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని తెలిపారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమన్నారు. చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌నే మేం కోరుతున్నామ‌ని స‌జ్జ‌ల వెల్ల‌డించారు. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదన్నారు. అయినా చ‌ర్చ‌ల‌కు రాక‌పోవ‌డం బాధాక‌రం అని తెలిపారు. ప్ర‌భుత్వం నాలుగుమెట్లు దిగ‌డానికి సిద్ధంగానే ఉంద‌ని చెప్పారు. రెచ్చ‌గొట్టే మాట‌ల‌ను మేం ప‌ట్టించుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. అనాలోచితంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఉద్యోగ సంఘాలు మొండివైఖ‌రితో వ్య‌వ‌హ‌రించొద్ద‌ని స‌జ్జ‌ల చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు మాకు శ‌త్రువులు కాద‌న్నారు. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.

ఇప్పుడు జీతాలు ఎలా

ఏపీలో పీఆర్‌సీ ఫైట్‌ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంతో ఉద్యోగుల సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించలేదు. మళ్లీ ఇవాళ  మరోసారి చర్చలు జరిపే ఛాన్స్‌ ఉంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం ఏపీలో పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయోజనాలను వివరించింది మంత్రుల కమిటీ. జీతాలు తగ్గాయన్న అపోహలను తొలగించే యత్నం చేసింది మంత్రుల కమిటీ. కానీ చర్చలు ఫలించలేదు. ఉద్యోగుల అపోహలు తొలగించే ప్రయత్నం చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 27వ తేదీన మరోసారి చర్చలకు పిలిచామని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని సజ్జల స్పష్టం చేశారు. ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండబోదని, ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు.ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. జీతాలు,పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ. మరోవైపు, డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగులు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. 11వ PRC జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ PRC సాధనసమితి ఆధ్వర్యంలో ఆందోళన పట్టారు ఉద్యోగులు.మరోసారి చర్చలకు ఆహ్వానం మరోవైపు, ఇవాళ ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం. సమస్యలను సమసర్య పూర్వకంగా పరిష్కరించుకుందామని సూచించింది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ పిలుపునిచ్చింది. అయితే, పీఆర్సీ జీవోలు రద్దు చేసేవరకూ చర్చలకు వెల్లమంతున్న స్టీరింగ్ కమిటీ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జిల్లాలో జరిగే రిలే దీక్షలకు హాజరుకావాలని జేఏసీ నేతలు కోరారు.అంటున్న ఉద్యోగులు పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్యర్యంలో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలిరానున్నట్టు స్పష్టం చేశారు.ఉద్యోగులకు ఒకటో తారీకు టెన్షన్. ఇదిలావుంటే, ఉద్యోగులకు ఒకటో తారీకు టెన్షన్ పట్టుకుంది. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జీతాల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ఇంకా ప్రాసెస్ చేయలేదని తెలుస్తోంది. ప్రతి నెలా 25 వ తేదీకల్లా బిల్లులు ప్రాసెస్ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిస్తుంటారు. అయితే, పాత జీతాలు కావాలంటున్న ఉద్యోగులు, కొత్త జీతాలు వేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు.. జీతాల బిల్లును ప్రాసెస్ చేయలేదని తెలుస్తోంది. 27 వ తేదీ వచ్చినా బిల్లులు ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. దీంతో ప్రతి నెలలాగే, ఈసారి ఒకటోవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు

Related Posts