YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగ, ఉపాధ్యయ నేతలు ఆరెస్టు

ఉద్యోగ, ఉపాధ్యయ నేతలు ఆరెస్టు

నందిగామ
చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల ను పోలీసులు అరెస్టు చేసి కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. జగన్ ప్రభుత్వం హిట్లర్ ప్రభుత్వాన్ని తలపిస్తుంది అని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. రివర్స్ పిఆర్సిని రద్దుచేసి, మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలి.  పెండింగ్ డిఏ లను మంజూరు చేసి పాత జీతాలనే ఇవ్వాలి. మాకు ఇవ్వవలసిన డిఏలను ఇచ్చి జీతాలు పెంచామనడం దారుణం. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు పే రివిజన్లో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం దారుణం.  ఒక పక్క ఉద్యోగులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొంటూనే మరోపక్క ఉద్యోగ, ఉపాధ్యాయు లను బెదిరించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గం. ఉద్యోగుల జీతాలు తగ్గించి పిఆర్సి అమలు ద్వారా ప్రభుత్వంపై పది వేలకోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
మెమోల ద్వారా బెదిరింపుల ద్వారా ఉద్యమాలు భయపడవనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి.  లేనిపక్షంలో తమ ఉద్యమం మరింత ఉధతం అవుతుందని, అందుకు ప్రభుత్వమే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

Related Posts