YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పిసి524'లో 'హేలి...' సాంగ్ విడుదల

కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పిసి524'లో 'హేలి...' సాంగ్ విడుదల

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన 'రాజావారు రాణిగారు' సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు - మాసు, యూత్ - ఫ్యామిలీ... అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. 'సెబాస్టియన్ పిసి 524'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సెబాస్టియన్‌ పిసి524'. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు.  జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో  సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ రోజు సినిమాలో 'హేలి...' సాంగ్ విడుదల చేశారు.
సినిమాలో హీరోయిన్ నువేక్ష పేరు హేలి. హీరోకి, ఆమెకు మధ్య సాగే ప్రేమ గీతమిది. జిబ్రాన్ సంగీతంలో కపిల్ కపిలాన్ ఆలపించారు. 'నీ మాట వింటే రాదా మైమరపే... నీ పేరు అంటే రాదా మైమరపే...' అంటూ సనపాటి భరద్వాజ పాత్రుడు పాటను రాశారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు 'సెబాస్టియన్ పిసి524'లో ప్రధాన పాత్రలు పోషించారు.

Related Posts