YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీబీఐ జోరు వెనుక...

సీబీఐ  జోరు వెనుక...

కడప, మార్చి 2,
కడపలో నరుక్కోవడాలు మామూలేనని సీబీఐ అధికారులు అంటున్నారని” వివేకా హత్య కేసు ముందుకు సాగడం లేదని ఓ సందర్భంలో ఢిల్లీలో వైఎస్ సునీత కంట తడి పెట్టుకున్నారు. అప్పట్లో సీబీఐ విచారణ అలా ఉండేది. వచ్చిన వాళ్లు విచారణ చేసేవాళ్లో లేదో తెలిసేది కాదు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా వెళ్లిపోయేవాళ్లు. ఎప్పుడు విచారణ చేసేవారో.. ఎప్పుడు చేసే వారు కాదో తెలిసేది కాదు. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించి చాలా కాలం అయినా ముందుకు సాగలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు వివేకా కేసు “హైపర్ యాక్టివ్‌”గా మారింది. చార్జిషీట్లు.. వాంగ్మూలాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది ? బీజేపీ రియలైజ్ అయిందా ? తమపైన కేసులు పెడుతున్న వివేకా హత్య కేసు అనుమానితులకు సీబీఐ షాకిస్తోందా ? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కీలక వాంగ్మూలాలు ! వివేకా హత్య కేసులో సాక్షులు, అనుమానితుల వాంగ్మూలాలు ప్రతీ రోజూ హెడ్ లైన్స్‌లోకి వస్తున్నాయి. వాంగ్మూలాలు మీడియాలోకి వస్తున్నాయి. అవేమీ ఇప్పటికిప్పుడు ఇచ్చినవి కాదు. సీబీఐ విచారణ ప్రారంభించినప్పుడు నమోదు చేసిన వాంగ్మూలాలు అవి. అవి ఇప్పటి వరకూ బయటకు పొక్కలేదు. చాలా సీక్రెట్‌గా ఉన్నాయి. అవి ఇచ్చిన వాళ్లూ బయటపడలేదు.. నమోదు చేసిన సీబీఐ కూడా గుంభనంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏం చెప్పారో వివరంగా.. విపులంగా మీడియాలో వస్తోంది. చార్జిషీటు కూడా పొల్లు పోకుండా బయటకు వచ్చింది. దీంతో వివేకా కేసులో అసలు నిందితులెవరో.. హంతకులెవరో.. సూత్రధారులెవరో ప్రజలే నిర్ణయించుకునే విధంగా ప్రజాకోర్టులో అన్నీ వివరాలు అంటున్నాయి. జగన్ సన్నిహితుల ప్రమేయం ఉందనే చెప్పేలా బలమైన ఆధారాలు వెలుగులోకి ! అయితే ఇప్పటి దాకా బయటకు రాని వాంగ్మూలాలు చార్జిషీట్లు ఇప్పుడు ఎలా బయటకు వస్తున్నాయన్నది చాలా మందికి అర్థం కాని విషయం. సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే కేంద్ర అధీనంలో ఉంటుంది. ఈ సంస్థను పరోక్షంగా ప్రభావితం చేయగలరు. గతంలో చూసీ చూడనట్లుగా ఉన్న కేంద్రం కూడా వివేకా కేసులో సీబీఐకి ప్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే సీబీఐ అధికారులు సీరియస్‌గా జరపడమే కాదు సూత్రధారుల్ని.. పాత్రధారుల్ని కూడా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబున్నారు.జగన్ సీఎం అయిన తర్వాత కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేసేలా కొంత మంది అధికారులు వ్యవహరించారన్న విషయాలను సీబీఐ అధికారులు వాంగ్మూలాలను బయటకు తెలిసేలా చేయడం ద్వారా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా బీజేపీతో జగన్‌కు పెరిగిన దూరాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో సీబీఐ అధికారులపైనే ఎదురుదాడికి దిగిన వైనం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులను నిశ్చేష్టులకు గురి చేసిందని దాని పర్యవసానమే మరికొన్ని పరిణామాలని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ సీబీఐ ఎన్నో కేసులు దర్యాప్తు చేసి ఉంటుంది కానీ నేరుగా సీబీఐ మీద.. సీబీఐ అధికారుల మీద కేసులు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ అది వివేకా హత్య కేసులో దర్యాప్తు విషయంలోనే జరిగింది. ఈ విషయంలో తాము రాజీ పడితే సీబీఐ వ్యవస్థకే ముప్పని .. మరింత సీరియస్‌గా ఉన్నతాధికారులు తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముందు ముందు ఈ కేసులో సీబీఐ దూకుడు ఇదే విధంగా కొనసాగితే.. రాజకీయ ప్రభావాలు లేకపోతే.. పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయవచ్చు.

Related Posts