YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం

అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం

విశాఖపట్నం
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పై అఖిల పక్షాలు పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21న విశాఖ రైల్వే జోన్ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేయతలపెట్టిన ట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పై సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కి నిధులు కేటాయింపులో కేంద్రం అన్యాయం చేసిందని, అలాగే పోలవరం కి నిధులు కూడా డా.కె కేటాయించలేదని, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదని తెలిపారు. రాష్ట్రానికి కావలసిన నిధులపై కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని పరిస్థితిలో ఉంది కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ నీ ఆంధ్ర రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. కేంద్రంపై పోరాటానికి కలిసివచ్చే అందరిని కలుపుకొని ముందుకు వెళ్తామని అని తెలియజేశారు.

Related Posts