YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

3 రాజధానుల బిల్లు అనుకున్నదే జరిగిందా..

3 రాజధానుల బిల్లు అనుకున్నదే జరిగిందా..

విజయవాడ మార్చి 4,
ఇది ఊహించిందే. అందుకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకున్నారు. ముందుగా ఊహించిందే కాబట్టి వైసీపీ సర్కార్ ఈ తీర్పు పట్ల ఎలాంటి ఆశ్చర్యానికి లోను కాలేదు. వైసీపీ నేతలు ఇది రాజకీయంగా తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికి అభివృద్ధిని పరిమితం చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మూడు ప్రాంతాల ప్రజలు విశ్వసించరని వైసీపీ గట్టిగా విశ్వసిస్తుంది.ఇక ఏ గొడవలుండవ్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తమ ప్రభుత్వం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చామని, అయితే టీడీపీతో పాటు కొందరు ప్రభుత్వ లక్ష్యాన్ని న్యాయస్థానం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీకే నష్టం.... "ఒక రకంగా ఇది మాకు మంచిదే. టీడీపీ ఒక ప్రాంతానికి, కొన్ని గ్రామాలకే పరిమితమవుతుంది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ద్వారా తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇది వచ్చే ఎన్నికల నాటికి తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందని అంటున్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాము మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. అయితే మరోసారి మూడు రాజధానుల బిల్లులపై జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం లేదంటున్నారు న్యాయనిపుణులు. గత అసెంబ్లీ సమావేశాలలో ఈ బిల్లుల రద్దు సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము కొత్త బిల్లులతో ముందుకు వస్తామని చెప్పారు. కానీ నేటి హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లో రాజధాని మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని చెప్పింది. అదే సమయంలో సీఆర్డీఏ తమకు ప్రతి నెల నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప మరే అవసరాలకు భూమిని వినియోగించకూడదని, తనఖా పెట్టకూడదని పేర్కొంది. దీంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను మరోసారి తెచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే రాజకీయంగా ఇది తమకు లాభమేనంటున్నారు వైసీపీ నేతలు.

Related Posts