YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

ఢిల్లీ షో... కంటిన్యూ....

ఢిల్లీ షో... కంటిన్యూ....

హైదరాబాద్, మార్చి 4,
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి మూడు రోజుల అయింది. రేపో మాపో తిరిగి వచ్చినా వస్తారు. అయితే, ఈ మూడు రోజుల్లో ఆయన ఎవరిని అయినా కలిశారా? అంటే లేదు. పోనీ ఆయన్ని ఎవరైనా కలిశారా అంటే అదీ లేదు.ప్రాంతీయ పార్టీలను కూడగట్టి, కాంగ్రెస్, బీజేపీ భరతం పడతానంటూ ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి, అక్కడే  మూడు రోజులున్నా, ముఖ్యనేతలు ఎవరినీ కలవలేదు. చివరకు, ఎవరు పుణ్యం కట్టుకున్నారో ఏమో కానీ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుభ్రమణ్య స్వామి అప్పాయింట్ సంపాదించారు. అయితే, స్వామి ఏమిటో, స్వామికి ఉన్న పొలిటికల్ స్టాండ్ ఏమిటో ఎందరికీ తెలిసిందే.  సుభ్రమణ్య స్వామి మంచి మేథావేకానీ, స్థిరత్వం లేని నాయకుడిగా మిగిలిపోయారు, అనేది అందరికీ తెలిసిన విషయమే. స్వామితో పాటుగా రైతు నాయకుడు రాకేశ్ టికాయత్’తోనూ కేసీఆర్ భేటి అయ్యారు. అయితే, టికాయత్’గతంలో  హైదరాబాద్’ వచ్చినప్పుడే తెరాస ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ  ఆందోళనలో చనిపోయిన 700 మంది కుటుంబాలకు, తెలంగాణ ప్రభుత్వం తరపున  కుటుంబానికి మూడు లక్షల వతునో ఏమో ఆర్థిక సహాయం అందిస్తామన్నా  టికాయత్’ వద్దు పొమ్మన్నారు. ముందు తెలంగాణలో రైతులు ఎదుర్కుంటున్న, సమస్యలు పరిష్కరించమని, ముఖ్యమంత్రి ముఖానే చెప్పి పోయారు. సో.. ఢిల్లీ వెళ్లి ఏదో చేశానని చెప్పు కునేందుకు  తప్పించి స్వామి, టికాయత్ భేటీ  ఇంకెందుకు పనికిరాదని తెరాస అభిమానులే పెదవి విరుస్తున్నారు. నిజానికి, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ, కేసీఆర్  ‘సారీ’ పేస్ తోనే తిరిగొస్తున్నారు. ఈసారి అయితే,  డబుల్ ‘సారీ’ తప్పేలా లేదని అంటున్నారు. అదే విషయాన్నితెరాస నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ముందు,కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు ఇక గత్తర పుట్టిస్తారు అని గొప్పలు పోయిన నాయకులే ఇప్పుడు, క్యాహోరా ..భాయ్’ అంటూ ఢిల్లీ మిత్రులకు ఫోన్లు చేసి,వాకబు చేస్తున్నారు.  ఏమీ లేదని, ఏదీ జరగడం లేదని, చివరకు, కేజ్రీవాల్’ కూడా ముఖం చాటేశారంటే, పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని, ఢిల్లీ నుంచి వస్తున్న సమాధానంతో, తెరాస నాయకులు, ముఖాలు చిన్నబుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆలాగే, సమాజ్ వాదీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కేసీఆర్’ కు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని తెరాస నాయకులు వాపోతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి వారణాశిలో ప్రచారం చేయాలని కేసీఆర్ అనుకున్నప్పటికీ ఆయనకు ఆహ్వానం అందక పోవడంతో,అంతా బ్రాంతియేనా, ఢిల్లీలో  పరువింతేనా? అంటూ విషాద గీతాలు పాడుకుంటున్నారు.  అందుకే,  ‘అలవి కాని చోట అధికులమనరాదు’ అంటారు. అయితే, కేసీఆర్ మాత్రం తగ్గేదేలే’ అంటూ ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. తెరాస నాయకులు అయితే అయిపోయారనే అనుకుంటున్నారు. అయితే, మొత్తం 543 సీట్లున్న లోక్ సభలో తెలంగాణ పంపగలిగేది, కేవలం 17 మంది సభ్యులను. అందులో టీఆర్ఎస్ గెలిచేది ఎన్ని, ఓడేది ఎన్ని లెక్కలు తీస్తే సింగిల్ డిజిట్ అయితే దాటదు. నిజానికి, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా కేసీఆర్ మాత్రమే కాదు, తెలంగాణ నుంచి గెలిచిన ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా, ప్రధాని కారు, కాలేరు. నిజానికి, పీవీ నరసింహ రావు అయినా, ఇప్పుడైతే’ ప్రధాని కాలేక పోయేవారేమో అంటున్నారు, రాజకీయ పండితులు. ఎవరు ఎన్ని చెప్పినా చివరకు నెంబరే.. కీలకం. బలమున్నవానిదే  బర్రె, నెంబర్ ఉన్నవానిదే  గద్దె’..ఎనీ డౌట్ .

Related Posts