YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కల్వకుర్తి అభివృద్ధిపై బహిరంగా చర్చకు సిద్ధమా..

కల్వకుర్తి అభివృద్ధిపై బహిరంగా చర్చకు సిద్ధమా..

రంగారెడ్డి
కల్వకుర్తి నియోజక వర్గానికి మూడేళ్ళలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఏం సాధించారని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ప్రశ్నించారు. కల్వకుర్తిలో జరిగిన అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే బహిరంగా చర్చకు రావాలని ఆచారి సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పురపాలకం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడారు. నియోజక వర్గంలో అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతూ మూడు సంత్సరాల్లో మూడు పనులు కూడా తేలేని ఎమ్మెల్యే తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల ను కలిసి ఆమనగల్లు -తలకొండపల్లి నాలుగు లైన్ల రహదారికి నిధులు మంజూరు చేయించానని ఆచారి అన్నారు. అదేవిధంగా శ్రీశైలం -హైదరాబాద్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ తో పాటు కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదగా ఏపీలోని కర్వెన వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం 12వందల కోట్లు సాధించామన్నారు. కల్వకుర్తి లో అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు తృటిలో విజయాన్ని కోల్పోయిన నిరంతరం మడమ తిప్పకుండా ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాని ఆచారి అన్నారు. తాను కేంద్రం నుంచి తెచ్చిన పనులను తానే తెచ్చానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఆచారి అన్నారు.

Related Posts