YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టు తీర్పు చారాత్రాత్మకం తులసి రెడ్డి

హైకోర్టు తీర్పు చారాత్రాత్మకం తులసి రెడ్డి

కడప
ఏపి రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్ట్  ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం . ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం నిర్ద్వంద్వంగా ప్రకటించడం హర్షణీయం. హై కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వం బేష జాలకు పోకుండా, సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయకుండా హై కోర్టు తీర్పును అమలు చేయాలి. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హై కోర్టు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. వెంటనే రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. రాష్ర్ట బి జె పి నాయకులు కేవలం మాటలు చెప్పడం కాకుండా, కేంద్రంలోని బి జె పి ప్రభుత్వంతో నిధులు విడుదల చేయించాలి.
పోలవరం
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ పోలవరాన్ని పరిశీలించడం హర్షణీయం. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఏడున్నర సంవత్సరాలలో కేవలం రూ. 11921 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణ , పునరావాసం కోసం రూ.30 వేలు కోట్లు కేంద్రం  వెంటనేవిడుదల చేయాలని అన్నారు.

Related Posts