YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన

మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన

మంగళగిరి
గుంటూరు జిల్లా మంగళగిరి లో  శుక్రవారం నాడు టీడీపీ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పర్యటించారు. లోకేష్ మాట్లాడుతూ బాబాయ్ వివేకా హత్య చేయించింది అబ్బాయి జగన్ రెడ్డే. అవినాష్ రెడ్డి హత్య చేయించాడని తేలిపోయింది. ఇక జగన్ రెడ్డి పాత్ర పై సీబీఐ విచారణ జరగాలి. నాడు సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని అసత్య ప్రచారం చేసారు. నేడు బాబాయ్ పై గొడ్డలి వేటు జగనాసుర రక్త చరిత్ర అని అందరికి అర్థమైంది. రాజధాని పై కోర్టు తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా రైతులు శాంతియుతంగా పోరాడి విజయాన్ని సాధించారు.  ఇది ముమ్మాటికీ రైతుల విజయమే. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు న్యాయ వ్యవస్థను కించపర్చడం మాని తీర్పుని గౌరవించి అమరావతిని అభివృద్ధి చెయ్యాలి. జడ్జీలను సైతం కించపరిచే విధంగా పోస్టులు పెట్టించింది వైసిపి ప్రభుత్వం. ఆ కేసులో వైసిపి నేతలు అరెస్ట్ అయ్యారు.  మరోసారి వైసిపి నేతలు న్యాయ వ్యవస్థను తప్పు పడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. న్యాయం రైతుల వైపు ఉంది కాబట్టే తీర్పు అనుకూలంగా వచ్చింది. మూడు ముక్కలాట మూర్ఖత్వాన్ని వీడి ఒకే రాష్ట్రం- ఒకే రాజధానికి వైసిపి కట్టుబడాలి. చెయ్యాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ... రాజధాని వికేంద్రీకరణ కాదని అన్నారు.
మంగళగిరి టౌన్ మహిళలు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పెట్టుబడి పెరిగింది ఆదాయం తగ్గిందని తమ సమస్యలు లోకేష్ తో   వ్యాపారస్తులు చెప్పుకున్నారు. లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత చిరు వ్యాపారులకు ఊతం ఇచ్చేలా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటి పన్ను, చెత్త పన్ను , కరెంట్ బిల్లులు, ఇలా అన్ని పెరిగిపోయి బ్రతుకు భారంగా మారిందని తమ ఇబ్బందులు లోకేష్ కి మహిళలు  ఏకరువు పెట్టారు.
జగన్ రెడ్డి వచ్చిన తరువాత బాదుడే...బాదుడు ఎవరినీ వదలడం లేదు.  ముక్కు పిండి ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నారు. అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.  అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి కట్ చేస్తున్నారు, కరెంట్ బిల్లు కారణం చూపి పెన్షన్ కట్ చేస్తున్నారు, ఇక రేషన్ కార్డులు భారీగా తొలగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి చూస్తుంటే బాధేస్తుంది. కనీసం గుంతలు పూడ్చే దిక్కు లేదు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను పోరాడతాను. అర్హులైన వారికి పెన్షన్లు ఎందుకు కట్ చేసారని కలెక్టర్ గారికి లేఖ రాస్తే కొంత మందికి ఇప్పుడు పెన్షన్ తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక సమస్యల పై పోరాటాన్ని ఉదృతం చేస్తాం.  ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క ఇల్లు పేదలకు ఇళ్ళు నిర్మించలేదు పైగా మంగళగిరి లో పేదల ఇళ్లు అడ్డగోలుగా కూల్చేస్తునారు. సీఎం ఇంటి చుట్టుపక్కల పేదలు నివసించే హక్కు లేదనడం అత్యంత బాధాకరమని అన్నారు.

Related Posts