YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు

బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు

బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు బ్రాహ్మణ కార్పోరేషన్ భవనం పై వైసీపీ ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి వైసీపీ పాలకులు బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర నాయకుడు మల్లాది రాధాకృష్ణ.
విజయవాడ దగ్గర గల గొల్లపూడి లోని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ సొంత కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కలెక్టరేట్ ఇతర కార్యకలాపాల వ్యవహారాలు కు వినియోగించుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర నాయకుడు మల్లాది రాధాకృష్ణ, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భారతదేశంలోనే మొదటిసారిగా లోకహితం కోసం పనిచేసే బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2014 లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బ్రాహ్మణ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించి బ్రాహ్మణ కార్పొరేషన్ కు సొంత భవనాన్ని నిర్మింప చేశారు అన్నారు.
అలాంటి బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య నాయకత్వంలో నిరు పేద బ్రాహ్మణులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు అందించారన్నారు. నేటి వైసీపీ ప్రభుత్వం లో బ్రాహ్మణ కార్పోరేషన్ నిర్వీర్యం చేసి, ఆ భవనాన్ని కూడా వైసీపీ పాలకులు దారి మళ్ళించడం దుర్మార్గమన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఒక వెలుగు వెలిగిన గొల్లపూడి లోని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యాలయం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రణాళికాబద్ధంగా బ్రాహ్మణులను దెబ్బతీయాలనే ఆలోచనతో బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసి, బ్రాహ్మణ కార్పోరేషన్ కు బడ్జెట్లో కేటాయించిన స్వల్ప పాటి నిధులు సైతం పక్కదారి పట్టించి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బ తీయడంతో పాటు బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసి చేతకాని దద్దమ్మలను బ్రాహ్మణ కార్పోరేషన్ కు పాలకులుగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నియమింప చేసుకుని, రాష్ట్రంలోని వైసీపీ పాలకులు శునకానందం పొందుతున్నారు అన్నారు.

Related Posts