YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మేకపాటి ఫ్యామిలో పోస్టుల రచ్చ

మేకపాటి ఫ్యామిలో పోస్టుల రచ్చ

నెల్లూరు, మార్చి 5,
జగన్ రాజేసిన చిచ్చు కారణంగా మేకపాటి కుటుంబం రెండుగా చీలనుందా...? జగన్ కావాలనే మేకపాటి రాజమోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహం రచించాడా...? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో రాజకీయంగా ఆ కుటుంబాన్ని బలహీన పరిచేందుకు వ్యూహం పన్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే అనిపిస్తుంది. మేకపాటి కుటుంబంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. మేకపాటి కుటుంబంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పొలిటికల్ టాక్ నడుస్తోంది.నెల్లూరు జిల్లాలో ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబాల తరువాత మేకపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రులు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి లాంటి రాజకీయ కురువృద్ధులతో కూడా విభేదించి రాజకీయంగా నిలదొక్కుకున్న కుటుంబం మేకపాటి కుటుంబం. చివరిగా వైఎస్సార్ తో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగింది ఈ కుటుంబం. రాజశేఖరరెడ్డి మరణానంతరం మేకపాటి కుటుంబం జగన్ కు అండగా నిలిచింది. కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదిరించి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ కు తోడుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేకపాటి కుటుంబం పదవులు త్యాగం చేసి ఆర్దికంగా, రాజకీయంగా జగన్ కు మద్దతుగా నిలిచింది.సీన్ కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డికి ఎంపి టిక్కెట్ ఇవ్వకుండా జగన్ షాకిచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్ ముఖం చూసేందుకైనా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇష్టపడలేదట. ఆ తరువాత రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కొందరు నేతలు రాజమోహన్ రెడ్డి త్యాగానికి ప్రతిఫలంగా మంచి పదవి ఇవ్వాలని జగన్ వద్ద మొరపెట్టారట. దానికి జగన్ స్పందిస్తూ.. ఆయన కొడుకు గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం కదా.. అని చెప్పి మరోసారి అవమానించారట. దీంతో జగన్ కు రాజమోహన్ రెడ్డికి ఇంకాస్త దూరం పెరిగిందంటారు. అదలా ఉండగా.. మంత్రి మేకపాటి గౌతమ్ అకాల మరణం ఆ కుటుంబాన్ని మరింత చిక్కుల్లో పడేసింది. గౌతమ్ మరణంతో ఆ కుటుంబంపై మరింత బాధ్యత పెంచింది. కొడుకు చూసుకుంటాడులే.. అనుకుని ప్రశాంతంగా ఉన్న సమయంలో గౌతమ్ రెడ్డి మరణించడంతో రాజమోహన్ రెడ్డి మరింతగా కుంగిపోయారు.జగన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై మరో బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి పేరు తెరమీదకు తెచ్చారట జగన్ రెడ్డి. దీంతో ఆ కుటుంబం సంక్షోభంలో పడిందంటున్నారు. నిజానికి మేకపాటి కుటుంబంలోని మహిళలు ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు తన కోడలికి ఎమ్మెల్యే పదవిని ఆశ చూపి తమ కుటుంబంలో జగన్ రెడ్డి చిచ్చురగిలించారని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోపంతో రగిలిపోతున్నారట. అసలే కొడుకును కోల్పోయిన బాధలో ఉంటే తన కుటుంబాన్బి విచ్ఛిన్నం చేసేందుకు జగన్ దుర్మార్గమైన పన్నాగం పన్నారని రాజమోహన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారట.వాస్తవానికి గౌతమ్ మరణం తరువాత ఆ బాధ్యతలు మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇస్తారని, ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారని, మంత్రి పదవిని కూడా ఆయనకు కట్టబెడతారని కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ విషయం ముందు నుండే పసిగట్టిన జగన్ తన ఎత్తుగడను ముందే అమలు చేశారని ఇప్పుడు తెలియడంతో మేకపాటి కంగుతిన్నారట. గౌతమ్ చనిపోయిన వెంటనే జగన్ సతీ సమేతంగా వెళ్లి ఓదార్చారు. తరువాత అంత్యక్రియలకు ఆయన సతీమణి భారతీరెడ్డిని రంగంలోకి దించారు. గౌతమ్ రెడ్డి భార్య చెవిలో ‘నువ్వే ఎమ్మెల్యే.. రెడీగా ఉండు.. మేం అండగా ఉంటాం’ అని చెప్పారట.అప్పటి వరకూ రాజమోన్ రెడ్డి మాట జవదాటని కోడలిగా పేరున్బ కీర్తిరెడ్డి ఒక అడుగు ముందుకేసి, తాను ఎమ్మెల్యే అయిపోయినట్టు ఫీలయి రోజుకు రెండుసార్లు భారతీరెడ్డితో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఎమ్మెల్యే ఇస్తే.. మంత్రి పదవి కూడా ఇవ్వాల్సి వస్తుందని జగన్ ముందుగానే ఇలాంటి స్కెచ్ వేశారని రాజమోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఈ మధ్య కాలంలో గౌతమ్ రెడ్డి శాఖను అప్పలరాజుకు అప్పచెప్పి.. ఇక మేకపాటికి లేదని చెప్పకనే జగన్ చెప్పారంటున్నారు. కీర్తిరెడ్డికి ఉప ఎన్నికలలో అవకాశం ఇస్తున్నామని ఇప్పటికే ఆయన దూతల చేత తెలియజేశారు. దీంతో ఇప్పుడు మామా కోడళ్ల మధ్య చాలా దూరం పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts