YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీకి దూరం.. టీడీపీ కీలక నిర్ణయం..

అసెంబ్లీకి దూరం.. టీడీపీ కీలక నిర్ణయం..

అమరావతి మార్చ్ 5
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు. మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ… బడ్జెట్‌ కూర్పు ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే టీడీపీ మాత్రం ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో శాసన సభలో బాబును అవమానించారని టీడీపీ గుర్రుగా వుంది. తిరిగి సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ చంద్రబాబునాయుడు శపథం చేశారు. దీంతో బాబు లేకుండా ఎమ్మెల్యేలు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై చర్చించారు. దీంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రకటన చేసిన రోజునే ఇకపై ఎన్నికలయ్యేంత వరకు టీడీపీ అసెంబ్లీకి రాదని.. చాలామంది డిసైడ్‌ అయిపోయారని అందుకే సభకు దూరంగా వుండి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Related Posts