YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు తప్పని ఇబ్బందులు

చంద్రబాబుకు తప్పని ఇబ్బందులు

గుంటూరు,  మార్చి 7,
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబుకు కొంత ఇబ్బందులు తప్పేట్లు కన్పిస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ యా ప్రాంతాలపై రాజకీయంగా ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. అమరావతి అన్ని ప్రాంతాలకు దగ్గరే. దానిని ఎవరూ కాదనరు. అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అందరూ అంగీకరించారు. కానీ హైకోర్టును కర్నూలులో పెట్టాల్సిన చంద్రబాబు దానిని కూడా అమరావతిలో నెలకొల్పారు. దీంతో రాయలసీమ వాసులకు సహజంగానే ఆగ్రహం కల్గిస్తుంది. అమరావతిని మరో హైదరాబాద్ లా మార్చేస్తున్నారని సీమ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలుకు కనీసం హైకోర్టు ఇవ్వకుండా చంద్రబాబు సీమకు ద్రోహం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ వచ్చిన తర్వాత న్యాయరాజధానిని కర్నూలులో పెడతామని చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకు రాయలసీమ జిల్లాల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు చెప్పినా దానికి కారణం చంద్రబాబు అని ప్రజలు నమ్ముతారు.ఇక ఉత్తరాంధ్ర కూడా అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని జగన్ ప్రతిపాదించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశముంది. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో ఆరు స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పదే పదే అమరావతి నామస్మరణం చేయడం వల్ల ఆయనకు నష్టం చేకూరుతుందని టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడూ న్యాయం జరగలేదు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి తాను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చే హామీలను ప్రజలను నమ్ముతారా? అన్నది సందేహమే. ఎందుకంటే చంద్రబాబు హామీలకు 2019 కు ముందే విలువ లేకుండా పోయింది. అమరావతి, పోలవరం తప్ప ఆయనకు మరో ధ్యాస లేకుండా పోయిందన్న పేరు వచ్చింది. అందుకే హైకోర్టు తీర్పుతో టీడీపీ స్వల్పకాలికంగా సంతోషంలో ఉన్నా దీర్ఘకాలంలో నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts