YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ మార్చ్ 7
శాసనసభలో మంత్రి హరీష్ ‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు మైక్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.  స్పీకర్... సభ్యుల సభా గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. స్పీకర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.

సభలో నిబంధనలకు తూట్లు : భట్టి
అప్రజాస్వామికంగా శాసనసభను నడుపుతున్నారని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అనంతరం బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ సభలో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదన్నారు. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారం సభ నడపడం సరికాదని, సభాపతిని చూసి సిగ్గుపడుతున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

సీఎం డైరెక్షన్‌లో బొమ్మలా నటిస్తున్న స్పీకర్: జగ్గారెడ్డి
ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాపోయారు. సీఎం డైరెక్షన్‌లో స్పీకర్ బొమ్మలా నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకే సభలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కినట్లే.. రాష్ట్రంలో గుండా, రౌడీ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని.. ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదని.. ప్రజలే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు: సీతక్క
తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్పీకర్‌లు బండ్రోతులా మారుతున్నరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా స్పీకర్‌లు ఇలా ప్రవర్తించ లేదని తెలిపారు. స్పీకర్‌కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుందని... పాయింట్ ఆర్డర్ లేవనెత్తి తే కూడా తమ మొహం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తామన్నారు. ‘‘మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే’’ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Related Posts