YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీలోమైనారిటీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టి ఆమోదించాలి

అసెంబ్లీలోమైనారిటీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టి  ఆమోదించాలి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకునాలుగు శాతం రిజర్వేషన్ తో సహా  అందించిన జనరంజక పాలనలో, ఐదు శాతం కూడా సుపరిపాలననువైకాపాప్రభుత్వంలో  వైయస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు అందించలేదనికాంగ్రెస్పార్టీఇన్చార్జ్సిఎల్పిఅల్లాబకష్అన్నారు. ఆదివారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్ మోహన్ రెడ్డిని మైనారిటీ లైన మేము ఎప్పుడూ గౌరవిస్తామని, ఆయన చేసే ప్రజావ్యతిరేక పాలనా విధానాన్నికాంగ్రెస్ పార్టీకినచ్చదుఅన్నారు.రాష్ట్రంల    మూడేళ్ళ వైసీపీ పరిపాలనలో ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదన్నారు.జగన్ రెడ్డి తన పాదయాత్ర లోమైనారిటీలకుఇచ్చిన హామీలనునెరవేర్చకపోవడం   చాలా బాధాకరమని పేర్కొన్నారు. గత పది నెలల ముందు కంటితుడుపు చర్యగా బడ్జెట్లో పేరుకు మాత్రమే ముస్లిం మైనార్టీల కు ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.ఈ రాష్ట్ర మైనార్టీల పైన జగన్ మోహన్ రెడ్డి కి ప్రేమాను రాగాలుంటే అది నిరూపించుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేడు 7వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్  ను ప్రవేశపెట్టి ఆమోదించి ఈ రాష్ట్ర మైనార్టీ లపైన సీఎం కున్నచిత్తశుద్ధిని నిరూపించు కోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఖదీర్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలీ, కాంగ్రెస్ మైనార్టీ నేతలు తాజుద్దీన్,షేక్ షావాలి పాల్గొన్నారు.

Related Posts