YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ లో కొత్త ఊపు...

 కాంగ్రెస్ లో కొత్త ఊపు...

వరంగల్, మార్చి 8,
ఏదో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే పెద్ద వార్ జరుగుతున్నట్లు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే…అసలు తెలంగాణలో ఆ రెండు పార్టీలే ఉన్నట్లు పోరు క్రియేట్ చేశారు…ఇటు ఏమో బీజేపీ..టీఆర్ఎస్‌ని టార్గెట్ చేయడం…అటు టీఆర్ఎస్ సైతం..బీజేపీని టార్గెట్ చేయడం. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ కనబడకుండా పోయింది. అంటే కాంగ్రెస్ పని అయిపోయిందనే విధంగా రాజకీయం నడిపారుకానీ ఎంత రాజకీయం నడిపిన సరే..తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరికీ అర్ధమవుతుంది…ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఊహించని బలం ఉందని తెలుస్తోంది…చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ ఉంది. పైగా ఇటీవల రేవంత్ రెడ్డి సైతం దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ…కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకురావడానికి చూస్తున్నారు. అలాగే సీనియర్ల అసంతృప్తికి కూడా చెక్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది..ఇటీవల జగ్గారెడ్డి అంశం ఏ విధంగా హైలైట్ అయిందో తెలిసిందే..అయితే ఇప్పుడు జగ్గారెడ్డి అంశాన్ని సైలెంట్ చేశారు.పూర్తిగా బలోపేతంపైనే ఫోకస్ పెట్టారు…అసలు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు గాని…అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సుమారు 40 లక్షల సభ్యత్వ నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరించిందని చెప్పొచ్చు..అసలు ఇన్ని సభ్యత్వాలు అవుతాయని కాంగ్రెస్ నేతలే ఊహించలేదని చెప్పొచ్చు..కానీ రేవంత్ రెడ్డి దీనిపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇటీవల కూడా సభ్యత్వం ఉన్నవారికి అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే.అలాగే సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాలపై రేవంత్ స్పెషల్ గా ఫోకస్ పెట్టి పనిచేయిస్తున్నారు..అవసరమైతే నేతలకు క్లాస్ కూడా పీకుతున్నారు. అసలు కాంగ్రెస్‌లో పూర్తిగా మార్పులు తీసుకొస్తున్నారు…ఇదే ఊపుతో ముందుకెళితే కాంగ్రెస్‌ సత్తా చాటే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌కు 80 లక్షల ఓట్లు వస్తే 90 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని రేవంత్ అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏ మేర ప్రజా మద్ధతు పొందుతుందో.

Related Posts