YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రోడ్లకు 718 కోట్లు

రోడ్లకు 718 కోట్లు

హైదరాబాద్, మార్చి 8,
రోడ్లు అభివృద్ధికి ఆనవాళ్లు. మౌలిక వసతుల్లో ఇది కూడా ప్రధానమైనది. రహదారి ఆర్ధికాభివృద్ధికి బాటవేసే సాధనం. సాంఘిక ప్రయోజనాలకు మూలం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రోడ్లు తళతళా మెరిసాయి. అప్పట్లో గులాబీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చి మరీ రోడ్లను నిర్మించింది.ఇది అన్నీ స్థాయిల్లో జరిగింది. పంచాయతీరాజ్‌ రోడ్లు, భవనాల శాఖల పర్యవేక్షణలో రోడ్ల నిర్మాణం జరిగింది. సీఎం కేసీఆర్‌ సర్కారు అధికారంలోకి వచ్చే మొదటి విడతలో రోడ్ల గురించి అందరి నుంచి ప్రశంసలే వచ్చాయి. అభినందనల పర్వం కొనసాగింది. రెండో విడతలో మాత్రం విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. గత రెండేండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించారు. నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఆయా రాజకీయ పార్టీలు సైతం రోడ్ల పున:నిర్మాణం కోసం స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. అంతేగాక గతేడాది వర్షాలకు భారీస్థాయిలో దెబ్బతిన్నాయి కూడా.రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రోడ్ల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ. 6500 కోట్లు కేటాయించింది. వాటినే గత ఏడాది వరకూ ఖర్చుపెడుతూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు పాత వాటికి మరమ్మత్తులు, కొత్త వాటి నిర్మాణం, పాతవాటి నిర్వహణ కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేశారు. కాగా కాంట్రాక్టర్లకు కొంత మేర బిల్లులు బకాయి ఉన్నట్టు సమాచారం.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. గుంతలమయంగా మారాయి. మరమ్మత్తులకు నిదుల కొరత ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండేండ్ల నుంచి రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తుల కోసం నిధుల కోసమ డిమాండ్‌ పెరుగుతున్నది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణం.పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణం కోసం తాజాగా ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్టు సమాచారం. 2023 చివర్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ నాటికే రోడ్లను మరోసారి మరమ్మత్తులు, కొత్తవి నిర్మించడం, ఉన్నవాటికి పూర్తిస్థా యిలో మరమ్మత్తులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈమేరకు కొత్త ప్రతిపాదనలు పంపాలంటూ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వీటిని తెప్పించి వేగంగా పనలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతున్నది. వీటి కోసం సుమారు రూ. 3000 నుంచి రూ. 4000 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నది. సిద్ధిపేట మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ తరహా కసరత్తు ప్రారంభమైంది. దీనిపై సీఎం ఆసక్తిగా ఉన్నారు.మంత్రి హరీశ్‌రా వుతోపాటు ఆ మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించి ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకునే పనిలో ఉన్నారు.సీఎం సొంత నియోజకవర్గమై న గజ్వేల్‌లో రోడ్లు అద్దంలా ఉండాలని సీఎం చెప్పినట్టు ఆదేశించినట్టు సమాచారం.ఈమేరకు ఆ శాఖ ఉన్నతా ధికారులు సన్నాహాలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ కోసం రూ.781.69కోట్లు ఇటీవల మంజూరు చేసింది.ఈ నిధులతో 2807 కిలోమీ టర్ల మేర పనులు చేయనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల కోసం రూ.128.9 కోట్లు,పాత వాటి పునరుద్ధరణకు రూ.609.09 కోట్లు,ప్రత్యేక మరమ్మత్తులకు రూ.43.69కోట్లు ఇస్తూ ఆదేశాలిచ్చింది.ఈ పనులతోపాటు కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ తలమునకలై ఉంది.

Related Posts