YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొడాలి వర్సెస్ వంగవీటి తప్పదా....

కొడాలి వర్సెస్ వంగవీటి తప్పదా....

విజయవాడ, మార్చి 9,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో గుడివాడ వేదికగా ఆయన.. తన  సామాజిక వర్గం నేతలతో తరచు సమావేశాలు, చర్చలు జరుతున్నారా? అంటే అవుననే అంటున్నారు సదరు పట్టణ పురజనులు. ఆయన తాజాగా గుడివాడలోని ఆర్టీసీ కాలనీలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నేతలతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆ సామాజిక వర్గం నేతలతో పాటు.. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం పాల్గొన్నారు. అధికార జగన్ పార్టీకి చెందిన నేతలు అయితే ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. గుడివాడ మీదుగా... ఏ ఫ్రాంతానికి వెళ్లినా.. సదరు పట్టణాన్ని వేదికగా చేసుకుని వంగవీటి రాధా తరచూ.. ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలతో కీలక సమావేశాలు జరపడం పట్ల.. భవిష్యత్తులో ఆయన ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు అయితే జోరుగా ఊపందుకొన్నాయి. కృష్ణాజిల్లాలో రాజకీయ చైతన్యం చాలా అదికంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసేందే. అలాంటి జిల్లాలో అదీ బెజవాడను వదిలి గుడివాడ నుంచి వంగవీటి ఎందుకు రంగంలోకి దిగాలనుకుంటున్నారనే ప్రశ్న అయితే జిల్లా వ్యాప్తంగా ఉత్పన్నమవుతోంది. మరోవైపు.. కొడాలి నాని, వంగవీటి రాధా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన స్నేహితుడు కొడాలి నానికి వంగవీటి రాధా ఎందుకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడంటే.. అందుకు నియోజకవర్గ ప్రజలు పలు కారణాలు  చెబుతున్నారు. మంత్రి కొడాలి నానికి గుడివాడ కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని రాజశేఖర్ తనయుడు దేవినేని అవినాష్‌ను సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలలోకి దింపిందీ టీడీపీ. కానీ ఈ ఎన్నికల్లో కొడాలి నానినే గెలుపొందారు. వంగవీటి ఫ్యామిలీకి, దేవినేని ఫ్యామిలీకి చాలా కాలంగా రాజకీయ వైరం ఉన్న విషయం విధితమే. అయితే గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు  అత్యధికంగా ఉన్నాయి. అంతేకాదు.. అభ్యర్థి గెలుపునకు ఈ ఓట్లే అత్యంత కీలకమన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొడాలి నాని చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. సదరు సామాజిక వర్గానికి చెందిన నేత వంగవీటి రంగాను హత్యకు కారణమైన వారు.. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని. వారిని ఓడించేందుకు మీరంతా ఫ్యాన్ పార్టీకి ఓటు వేయాలని తన ప్రచారంలో కొడాలి నాని పిలుపు నిచ్చారు. అంతేకాదు.. తన గెలుపు కోసం.. సదరు సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా .. ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని విధాల కొడాలి నాని వాడుకొని.. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత సదరు సామాజిక వర్గాన్ని దూరం పెట్టారనే టాక్ అయితే సదరు నియోజకవర్గంలో జోరుగా వైరల్ అయింది.   సదరు సామాజిక వర్గం వారు.. ఏదైనా పని చేయించుకోవాలని.. మంత్రి కొడాలి నాని వారి వద్దకు వెళ్తే.. రేపుమాపు అంటూ వారిని నానా ఇబ్బందులకు గురి చేసేవారనే టాక్ కూడా గుడివాడలో బలంగానే ఉంది. అంతేకాదు.. వంగవీటి రాధాతోపాటు ఆయన అభిమానులపై కొడాలి నాని తరచు బహిరంగంగానే సెటైరికల్ కామెంట్స్ చూస్తున్నాడనే చర్చ కూడా గుడివాడ నియోజకవర్గంలో చాలా హాట్ హాట్‌గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాల నాని వ్యవహారాన్ని .. గుడివాడ వచ్చిన వంగవీటి రాధా ముందు నియోజకవర్గంలోని కాపు నేతలంతా ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా.. బెజవాడను వదిలి గుడివాడ నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. తామంతా మీకు అండగా ఉండడమే కాకుండా.. రానున్న ఎన్నికల్లో మీ గెలుపు కోసం తామంతా శాయశక్తుల కృషి చేస్తామని వంగవీటి రాధతో సదరు సామాజిక వర్గ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక.. గుడివాడ నియోజకవర్గంలో కూడా రాజకీయ చైతన్యం అధికం. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి.. కొడాలి నాని కంచు కోటను బద్దలు కొట్టాలనే వ్యూహాంలో బాగంగానే వంగవీటి.. గుడివాడ వేదికగా.. రాజకీయం చేయాలని భావిస్తున్నారనే టాక్ అయితే సదరు నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.

Related Posts