YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యేల నిరసన

టీడీపీ ఎమ్మెల్యేల నిరసన

అమరావతి
నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసాగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉందని తెలిపారు. నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసాగించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో 90 వేల పోస్టులు భర్తీ చేస్తే ఏపీలో ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉసురు  ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యలుచేశారు. పదవీ విరమణ చేసిన వారి పోస్టులు కూడా భర్తీ చేయట్లేదని మండిపడ్డారు. గుడ్డి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. ఆదాయం పెరిగిందంటున్న ప్రభుత్వం... ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

Related Posts