YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగనన్న ఇళ్ల స్థలాలపై అధికారుల సమీక్ష

జగనన్న ఇళ్ల స్థలాలపై అధికారుల సమీక్ష

కొవ్వూరు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలందరికి ఇళ్ళ కార్యక్రమాన్నీ మరింత గా లబ్దిదారులకి చేరువ చెయ్యాలని రాష్ట్ర హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & జిల్లా ప్రత్యేక అధికారి  ఎమ్. కమలాకర బాబు పేర్కొన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని అధికారుల, ఉద్యోగుల, సిబ్బంది ప్రేరణ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్ రెడ్డి  తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలాకరబాబు మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించబడిన ప్రతి లబ్దిదారుడు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు పధకం కింద 15.60 లక్షల మంది కి ఇళ్ళు మంజురు చేసి ఇళ్ల పట్టాలు అందించడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1,49,549 మందికి మంజురూ చెయ్యగా, వాటిలో సుమారు 90 వేల ఇళ్ళు వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్నాయన్నారు. మిగిలిన ఇళ్ళు కూడా మార్చి 31 నాటికి ప్రారంభింపచెయ్యలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామన్నారు.  జూన్ 2023  నాటికి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాల ను చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆ దిశలోనే  ఎప్పటికప్పుడు లబ్దిదారులకి  నగదు చెల్లింపు లను జరుపు తున్నట్లు కమాలకర బాబు తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వారి ఆదేశాలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు క్షేత్రస్థాయిలో  లే అవుట్ల లో పర్యటించి పరిస్థితిని సమీక్షించడం జరుగుతోందని, జిల్లా కలెక్టర్ లు కూడా ప్రత్యేక శ్రద్ద చూపడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు . సిమెంట్, ఇసుక, ఐరన్ వంటి ముడి సరుకులు కొరత లేకుండా సరఫరా చేస్తూ త్వరితగతిన ఇంటి నిర్మాణాలు కోసం సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తోందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల వివరాలు నమోదు , ఇళ్ల నిర్మాణం, వివిధ దశల్లో ప్రగతి తదితర అంశాలపై పిపిటి ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ టి. వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ ఈఈ  సిహెచ్. బాబూరావు, ఎంపీడీఓ జగదాంబ, డిఈఈ ఎమ్. శ్రీనివాస రావు,  హౌసింగ్ ఏ ఈ లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts