YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రసవత్తరంగా వెంకటగిరి రాజకీయం

రసవత్తరంగా వెంకటగిరి రాజకీయం

ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్‌. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి టీడీపీ కార్యకలపాలకంటే సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట రామకృష్ణ. దీంతో కొందరు టీడీపీ నేతలు వైసీపీతో టచ్‌లోకి వెళ్లారు. ఇది కేడర్‌కు మరింత అసంతృప్తి తీసుకొచ్చింవెంకటగిరిలో టీడీపీ ఐదుసార్లు గెలిచింది. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నా.. నేతలతో సఖ్యత లేదు. దీంతో సైకిల్‌ పార్టీ బలహీనపడుతోంది. గత ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వైఖరి వల్లే టీడీపీ ఓడిపోయిందని చెబుతున్నారట కార్యకర్తలు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న, కీలకమైన వెంకటగిరి రాజాలు.. రామకృష్ణ తీరు నచ్చకే టీడీపీకి దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీకి పెద్ద దెబ్బ అని కేడర్‌ వాపోతుంది.ఇంత జరిగినా టీడీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన రామకృష్ణ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేడర్‌ మండిపడుతోంది. వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారయణరెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏం చేయలేకపోతున్నా అని ఆయన ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారు. జిల్లాలోని మంత్రులు తనకు సహకరించకే వెంకటగిరి అభివృద్ధిలో వెనకపడుతోందని.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదని పలు సందర్భాలలో ఆనం ఆరోపించారు. ఈ అంశాన్ని రాజకీయంగా టీడీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్నది కార్యకర్తల మాట.ఇదే నియోజకవర్గానికి చెందిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి కేబినెట్‌ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో వెంకటగిరిలో వైసీపీ రెండు వర్గాలుగా వ్యవహరిస్తోంది. ఎవరికి మద్దతిస్తే ఏమౌతుందో తెలియక సతమతం అవుతోంది అధికారపార్టీ కేడర్‌. అలాంటి వారిని ఆకర్షించడంలో రామకృష్ణ వైఫల్యం చెందినట్టు స్థానిక టీడీపీ వర్గాల వాదన. ఈ విషయాలను పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లడంతో రామకృష్ణను తప్పించి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట.బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో .. ఆ వర్గం నేతలు కొత్త వ్యూహాలతో వస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే లాబీయింగ్‌ చేస్తున్నారట. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కురుగొండ్లను మారుస్తారో లేదో తెలియదు కానీ.. కొత్త కొత్త నేతలు.. వారి పేర్లు వెంకటగిరిలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది తెలిసో ఏమో ఎప్పుడో ఒకసారి కనిపించే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ తరచూ రావడం మొదలుపెట్టారట. మరి.. కేడర్‌ను ఛార్జ్‌ చేయడానికి ఎవరిని ఇంఛార్జ్‌గా పెట్టి అభ్యర్థిని చేస్తారో చూడాలి.

Related Posts