YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పొత్తులపై మైండ్ గేమ్

పొత్తులపై మైండ్ గేమ్

కర్నూలు, మార్చి 25,
ఎన్నికల పొత్తుల రాజకీయంలో మళ్లీ టీడీపీకి దగ్గరయిపోతామేమో అని కంగారు పడుతున్న వైసీపీలోని ప్రో వైసీపీ లీడర్స్ ఒక్క సారిగా యాక్టివ్‌గా మారిపోయారు. బీజేపీ నుంచి ఎలాంటి పొత్తు ప్రతిపాదనలు లేకపోయినా.. మూకుమ్మడిగా టీడీపీతో పొత్తు వద్దంటూ హైకమాండ్‌కు తీర్మానాలు చేసి పంపేస్తున్నారు. కర్నూలులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఇందులో పదమూడుజిల్లాల అధ్యక్షుల నుంచి టీడీపీతో పొత్తు వద్దన్న లేఖలు తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపనున్నారు. బీజేపీతో పొత్తు లేకుండా చంద్రబాబు అధికారంలోకి రాలేరని.. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదనేది బీజేపీ నేతల తొలి మాట. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బిజెపికే వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ నతేలు చెబుతున్నారు. పొత్తులపై ‘మైండ్‌గేమ్‌’ ఆడుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. జాతీయపార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేకపోతున్నామని అందుకే సంస్థాగతంగా బలోపేతం కావాలని వారు నిర్ణయించుకున్నారు. బీజేపీ నేతల అభిప్రాయాలు ప్రకారం వైసీపీ గెల్చినా పర్వాలేదు కానీ.. టీడీపీ గెలవకూడదన్నది వారి సిద్ధాంతంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా టీడీపీతో పొత్తుల గురించే మాట్లాడుతున్నారు. టీడీపీ కూడా బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటం లేదు. జనసేనతో పొత్తు గురించే మాట్లాడుతోంది. బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. పైగా ఆ పార్టీ మీద ప్రజల్లో కనీసం ఓ అభిప్రాయం కూడా లేదు. అయినా వారు టీడీపీ ఎందుకు పొత్తు కోసం ప్రయత్నిస్తుందో చెప్పుకోలేకపోతున్నారు. ఒక్క శాతానికన్నా దిగువకు ఓట్ల శాతం ఉన్న బీజేపీ అండగా టీడీపీ ఎలా గెలుస్తుందో వారు చెప్పాల్సి ఉంది. అది చెప్పకుండా.. టీడీపీతో పొత్తుపై వారంతటికి వారే చెలరేగిపోతే.. అది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతుంది మరి.

Related Posts