YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో నిర్మాణాల సందడి

అమరావతిలో నిర్మాణాల సందడి

గుంటూరు, మార్చి 25,
అమరావతిలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 70 శాతానికిపైగా పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు.. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకులను అప్పు అడుగుతోంది.బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది. రూ.200 కోట్లు ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.95 కోట్ల వరకు వచ్చాయి.మిగిలిన మొత్తం కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నిధులతో ప్రస్తుతం పనుల వేగం పెంచాలని నిర్ణయించారు. అయితే నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలి. బ్యాంకుల నుంచి వచ్చే రుణం మేరకు వారికి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ నిధులతో అందుబాటులోకి వచ్చే భవనాల జాబితాను తీసుకుని ఆ మేరకు పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకే సరిపోతుంది. మిగిలిన టైప్‌ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభిస్తే అమరావతి పుంజుకున్నట్లే.

Related Posts