YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

48 వేల కోట్ల లెక్క ఏంటీ

48 వేల కోట్ల లెక్క ఏంటీ

విజయవాడ, మార్చి 28,
జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ అంటే ఇప్పటి వరకు వివిధ శాఖలు మాత్రమే భయపడ్డాయనుకున్నాం. అలా భయపడిన వాటి జాబితాలో ఇప్పుడు కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చోటు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చులో 48 వేల కోట్ల రూపాయలకు ఒక లెక్కా లేదు.. జమా లేదు.. దీంతో ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కాగ్ భయంతో వణికిపోయిందట. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో ఈ విషయం స్పష్టంగా రాయడం గమనార్హం. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచకానికి పరాకాష్ట అంటున్నారు.నిజానికి కాగ్ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. అలాంటి సంస్థను కూడా జగన్ రెడ్డి సర్కార్ భయాందోళనకు గురిచేసిందంటే ఇక చెప్పేదేముంది అంటున్నారు. వైసీపీ సర్కార్ చూపించిన జమా ఖర్చుల లెక్కలు అంతుపట్టనప్పుడు ఇచ్చే క్వాలిఫైడ్ ఒపీనియన్ ను కాగ్ ఇచ్చింది. నిజానికి దేశంలోని మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వంపైన కాగ్ ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. జమా ఖర్చులకు సంబంధించిన సమాచారం పీఏసీ అడిగినా ఇవ్వని జగన్ సర్కార్ తీరును టీడీపీ సభ్యులు ఎండగడుతున్నారు. గోల్ మాల్ అయిన 48 వేల కోట్ల నిధులపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఒక్క అవకాశం అంటూ ఏపీ ప్రజలను వేడుకుని తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ రెడ్డి సర్కార్ ప్రమాదంలో పడేసిందనే విమర్శలు సర్వత్రా వస్తున్న విషయం తెలిసిందే. అవగాహనా లేమితో.. గొప్పలకు పోయి కోట్లకు కోట్ల నిధులను ఖజానా సామర్ధ్యానికి మించి ఖర్చు చేసేసింది. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. తాను హామీ ఇచ్చిన నవరత్నాలు కూడా అమలు చేసే అవకాశం లేకుండా పోవడంతో.. అప్పుల కోసం అంగలార్చడం మొదలెట్టింది. సంవత్సరంలో 331 రోజులు ఆర్బీఐ నుంచి అప్పులతోనే వైసీపీ సర్కార్ బండి లాక్కొస్తోంది. అప్పుల పరిమితి కూడా దాటిపోవడంతో ఓవర్ డ్రాఫ్టులంటూ ఢిల్లీ చుట్టూ తిరిగింది. ఆనక బాండ్లనూ తాకట్టు పెట్టేసింది. అవీ చాలకపోవడంతో పలు ప్రభుత్వ శాఖల ఖాతాల్లోని నిధులను కూడా ఉన్నకాడికి ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో చివరికి ఆయా శాఖల రోజువారీ ఖర్చులకు కూడా తిప్పలు పడాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నాయి. భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా కుదవబెట్టేసి అప్పులు తెచ్చింది. అయినా.. కరువు తీరకపోవడంతో ఇలా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత..? దాంట్లో ఖర్చుపెట్టినది ఎంత అనేది సక్రమంగా లెక్కలు చెప్పకుండా నిధులను ఏమి చేసిందో కూడా చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. ఇప్పుడు కాగ్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో వైసీపీ సర్కార్ బండారం బయట పడింది.ఏపీలో ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్థం అయిపోయిందంటూ కాగ్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. లెక్కల్లో చెప్పలేనంత తికమక ఉందన్న కాగ్. అసెంబ్లీకి చెప్పకుండా లక్షా 9 లక్షల కోట్లను జగన్ రెడ్డి సర్కార్ ఖర్చుపెట్టినట్లు కాగ్ బయటపెట్టింది. ప్రభుత్వ చర్య ఆర్టికల్ 204(3)ని పూర్తి ఉల్లంఘనే అని పేర్కొంది. కార్పొరేషన్ల అప్పులు, వడ్డీలు చెల్లించి, బడ్జెట్ లో దాన్ని జగన్ సర్కార్ దాచిపెట్టిందని కాగ్ స్సష్టం చేసింది.కొన్ని నెలల క్రితం 48 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన జమా, ఖర్చుపై అంతు చిక్కడం లేదని విపక్షాలు చెప్పాయి. అప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేయడం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు రాజ్యాంగ ప్రతిపత్తి గల కాగ్ స్వయంగా ఆ విషయమే స్పష్టం చేయడం విశేషం. ప్రజల నిధులను ఇష్టానుసారం లెక్కా పత్రం లేకుండా ఖర్చుచేస్తే ఊరుకునేది లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు పయ్యావుల కేశవ్ అప్పుడే హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతే కాకుండా ఏపీలో ఆర్థిక అవకతవకలపై కేంద్రం ఆర్థిక మంత్రిని కలిసి, విచారణ కోరతామని కూడా కేశవ్ ప్రకటించారు. కేంద్రం ఉదారంగా ఇస్తున్న సాయంతో ఏపీ ఆదాయం బాగా పెరిగిందని, ఆ సొమ్మంతా ఏమైపోతోందో అర్థం కావడంలేదని పయ్యావుల తూర్పారపట్టారు.సర్కార్ పాల్పడ్డ 48 వేల కోట్ల రూపాయల అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రజల కోసం వైసీపీ సర్కార్ లక్షా 78 వేల కోట్లు ఖర్చు పెడితే.. 48 వేల కోట్లకు లెక్కలే లేపోవడాన్ని యనమల ప్రస్తావించారు. అంటే ఆ నిధులన్నింటినీ జగన్ రెడ్డి సర్కార్ దుర్వినియోగం చేసిందనేది యనమల ఆరోపణ. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చుపెట్టినట్లు వైసీపీ సర్కార్ చెబుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. స్పెషల్ బిల్లులు అనేవి ట్రెజరీ కోడ్ లోనే లేవనే విషయాన్ని యనమల తెలిపారు. అసలు జగన్ సర్కార్ లో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగా పనిచేయడంలేదని రామకృష్ణుడు ఆరోపించారు. అంటే పీఏసీ వ్యవస్థను కూడా జగన్ రెడ్డి సర్కార్ భయపెడుతోందనే అనుమానం ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. వాస్తవానికి వైసీప ప్రభుత్వం పీఏసీ జరగనివ్వకుండా వ్యవహరిస్తోందంటున్నారు.

Related Posts