YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామా

ఎమ్మెల్యేలతో  సామూహిక రాజీనామా

విజయవాడ, మార్చి 28,
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజునే కొత్త మంత్రి వర్గంకొలువుదీరనుంది. మార్చి 27, ఆదివారం ప్ర‌స్తుత మంత్రులంద‌రికీ ప్ర‌త్యేక విందు ఇవ్వ‌నున్నార‌ట సీఎం జ‌గ‌న్‌. ఆ విందు త‌ర్వాత కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు వీలు కల్పిస్తూ, ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రులంద‌రితో మూకుమ్మడి రాజీనామాలు చేయించ‌నున్నారు. ప‌ద‌వి కోల్పోయిన వారెవ‌రూ డిస‌ప్పాయింట్ కావొద్ద‌ని.. వారికి పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని.. మాజీలు కాబోయే వారిని ఓదార్చేందుకే ఆ డిన్న‌ర్ మీటింగ్ అని అంటున్నారు. విందు భేటీ త‌ర్వాత ముఖ్యమంత్రి కొత్త కేబినెట్‌కి తుది రూపం ఇవ్వ‌నున్నారు.కొత్త కేబినెట్ లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర కూర్పులో  పాత  పద్దతులనే కొనసాగిస్తారని అంటున్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. ఈసారి కూడా అదే ఆరో వేలు ఫార్ములా ఫాలో అవుతారని అంటున్నారు.పాత కాబినెట్’లో ఇచ్చిన విధంగానే కొత్త కేబినెట్’ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. అలాగే, ఈసారి కూడా హోం శాఖను మహిళకే అప్పగించనున్నట్లు తెలిసింది. ఆ ప‌ద‌వికి ఎమ్మెల్యే రోజా పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌య‌మై రోజాను తెలుగువ‌న్ సంప్ర‌దించ‌గా.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాబోతున్న విష‌యాన్ని ఆమె క‌న్ఫామ్ చేశారు. కానీ, హోంశాఖ‌ ఇస్తార‌నే విష‌యం మాత్రం త‌న‌కు తెలీద‌న్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవ్వయస్థీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన సందర్భంలోనే ప్రకటించారు. నిజానికి, ముఖ్యమంత్రి ముందుగా ప్రకటించిన గడువు కంటే ఆరు నెలలు ఆలస్యంగా  పునర్వవ్యవస్థీకరణ సిద్దమయ్యారు. నిజానికి, మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు సంబంధించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా, అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు మొదలైన తర్వాతనే ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని తొలిసారిగా ప్రస్తావించారు. పదవులు వదులుకునేందుకు సిద్దం కావాలని మంత్రులకు సంకేత మిచ్చారు. ఇక అక్కడి నుంచి పలు సందర్భాలలో ముఖ్యమంత్రి  ఈ విషయమై పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తుతం మంత్రుల్లో పని తీరు ఆధారంగా కేబినెట్ లో మార్చులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ మార్పులు చేర్పులు ఏ స్థాయిలో ఉంటాయనే విషయంలో స్పష్టత అయితే ఇంతవరకు లేదనే అంటున్నారు. పూర్తి స్థాయి పక్షాళన ఉంటుందా , లేక స్వల్ప మార్పులతో సరిపెడతారా అనేది తేలవలసి ఉంది.ముఖ్యమంత్రి సోదరి షర్మిల భర్త, అనిల్ కుమార్ అనుకోకుండా తెర మీదకు వచ్చారు. బీసీ, ఎస్స్పీ, ఎస్టీల సమావేశాలు  నిర్వహిస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని వినిపిస్తున్నారు. ఈ ప్రభావం మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై ఉంటుందా, సామాజిక సమీకరణాల విషయంలోనూ ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనే విషయంలో ఆసక్తి నెలకొంది.  మరో వంక మంత్రి పదవులు ఆశిస్తున్న, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మూడేళ్ళుగా అప్పులు తేవడంలో అలసి పోయిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనను మళ్ళీ మంత్రి వర్గంలోకి తీసుకున్నా ఆర్థిక శాఖ మాత్రం  వద్దు మహాప్రభో అని ముఖ్యమంత్రి వేడుకుంటున్నారని అంటున్నారు. అదే విధంగా మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తీరును బట్టి ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, లేదా అనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక‌, మంత్రి ప‌ద‌వులు రాబోతున్నాయంటూ వినిపిస్తున్న ఎమ్మెల్యేలు సైతం అంత ఖుషీగా ఏమీ లేరు. ఇదంతా ఎన్నిక‌ల కోస‌మేన‌ని.. ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి కాబ‌ట్టి మాలాంటి వారిని తీసుకుంటున్నార‌ని.. పెద‌వి విరుస్తున్నారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తోంద‌నే సంతోషం వారిలో క‌నిపించ‌డం లేదు. ఉన్న‌దంతా జ‌గ‌న‌న్నే స్వాహా చేస్తుంటే.. మంత్రి ప‌ద‌వి వ‌చ్చినా.. త‌మ‌కు పెద్ద‌గా ఉప‌యోగం ఏముండ‌ద‌ని.. ఖాళీ ఖ‌జానాతో కేబినెట్ పోస్ట్ ఏం చేసుకోవాల‌ని ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. ఇదలా ఉంటే, ఆరోవేలుతో సమానమైన మంత్రులను మార్చడం వలన ప్రయోజనం ఉండదని, మారిస్తే ముఖ్యమంత్రిని మార్చాలని విపక్షాలు సూచిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత అద్వాన్న స్థితికి చేరడానికి, ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలే కారణమని ఆరోపిస్తున్న విపక్షాలు మంత్రి మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వలన రాష్ట్రానికి, ప్రజలకు జరిగే మేలు ఏదీ ఉందని అంటున్నారు.

Related Posts