YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనాలి

తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనాలి

కరీంనగర్
రాష్ట్ర ప్రభుత్వానికి పంట నిల్వ చేసే అధికారం లేదని, రైల్వేవ్యాగన్లు, గోదాములు కేంద్ర ప్రభుత్వం చేతిలో, ఎఫ్.సి.ఐ పర్యవేక్షణలో ఉంటాయని కాబట్టి వాటిని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,   ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశం మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహా దర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ రైతు తన ఇంటి మీద నల్లజెండా ఎగరేయాలని, మన పంటల్ని కొన్నప్పుడే ఆ నల్ల జెండాల్ని దించాలని పిలుపునిచ్చారు. రైతు పంట పండించకపోతే ఎలా తింటామని అలాంటి రైతుని చల్లగా కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిదీ అన్నారు, ఇది రాజకీయ వేదిక కాదని, రైతు ఆవేదన అని అతని ఆవేదన కేంద్రానికి తెలిసేదాక పోరాడాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు మంత్రి గంగుల. వ్యవసాయాన్ని లాబసాటిగా, పెట్టుబడి లాగా చూడొద్దని, దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. లక్షల కోట్లు వెచ్చించినా రైతు లేకపోతే వ్రుదానే అన్నారు. రైతు ఏ పంట వేయాలో స్వేచ్చగా నిర్ణయించుకునే లాగా పరిపాలన ఉండాలని కేంద్రానికి హితవు ఫలికారు. లాబ నష్టాల బేరీజులు రైతుల విషయంలో మానేయాలన్నారు. శ్రీలంక సంక్షోభం చూసైనా కేంద్రం కళ్లు తెరవాలని, కనీసం ఐదు సంవత్సరాల నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. మనలాంటి పెద్ద దేశంలో కరువో, ఇంకా ఏదైనా జరగరానిది జరిగితే నిల్వలు లేకపోతే ఎవరూ సహకరించే పరిస్తితి ఉండదన్నారు వీటన్నింటిని ద్రుష్టిలో పెట్టుకోవాల్సిన కేంద్రం కేవలం అంబానీ, అదానీలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. పైపెచ్చు అహంబావంగా తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని అవమానించినా కేవలం రైతుల కోసమే కొట్లాట చేస్తున్నామన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నష్టం వచ్చినా మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన మక్కలు మద్దతు దరకు సేకరించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆ విధంగానే నష్టం వచ్చినా రైతులు పండించిన ప్రతీ పంటను సేకరించాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పంటలను ఉత్పత్తి చేసే విదంగా అనేక చర్యలు తీసుకున్నామని, రైతుబందు, రైతుబీమా, ఇరవైనాలుగ్గంటల కరెంటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు, ప్రతీ ఒక్కరికీ అందజేస్తున్నామన్నారు. ఇందులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలనే బేదం చూపించడం లేదని, ఈ నిరసనలో కూడా ప్రతీ రైతు పార్టీల కతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు, రేపట్నుండి సమస్య పరిష్కారమై కేంద్రం దిగివచ్చేదాక ఈ నిరసనలు కొనసాగించాలన్నారు. కేంద్రం డబ్బులు సరైన సమయానికి ఇవ్వకపోయినా కొన్న వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు.
వరి ధాన్యం అధికంగా పండించే చత్తీస్ఘడ్, ఆంద్రప్రధేశ్, తెలంగాణ, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో బీజేపీ లేదని కుట్రతో వరి కొనము అని నిర్ణయించుకోవడం అన్యాయమన్నారు. ప్రతీనెల సివిల్ సప్లైస్ నుండి నివేదికలు కేసీఆర్ గారికి ఇస్తామని, తెలంగాణ రాకముందు డెబ్బై ఏళ్లు పడ్డ రైతు గోసల్ని తీర్చడానికి గోదారికి కాళేశ్వరం వద్ద కాలు అడ్డం పెట్టి మండెటెండల్లో మత్తల్లు దుంకించారని, అసెంబ్లీలో కాలిన మోటార్లతో నిరసన తెలిపిన చోట 24గంటల నాణ్యమైన కరెంటు, అప్పుల కోసం షావుకార్ల చుట్టు తిరిగిన గోసలు తీర్చే రైతుబందు, అమ్మినంక నాలుగు నెల్లకు పంట పైసలు వచ్చే స్థితినుండి వారంలోపు ఖాతాల్లో వేసే తీరు, ఇవీ కేసీఆర్ గారు సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కరోనాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 7000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కేంద్రం అడుగడుగునా అడ్డు తగులుతుందని కనీసం సరిపడా గోనె సంచులు కూడా ఇవ్వడం లేదన్నారు.  తన సొంత రాష్ట్రం గుజరాత్లో లేని ఈ పథకాలు తెలంగాణలో ఎలా అనే కడుపు, కండ్ల మంటతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఒకవైపు తెలంగాణ అభివ్రుద్ద పథంలో దూసుకుపోతుంటే, రోడ్లు, మౌళిక వసతులు, గూగుల్, మైక్రోసాప్ట్ లాంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్కి క్యూకడుతుంటే, కరీంనగర్లో మానేరు రివర్ ప్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి అభివ్రుద్ది పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా చేస్తుందన్నారు మంత్రి గంగుల.  ఇలా మనం డెవలప్మెంట్ చేసుకుంటుంటే మనల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చిన కేంద్రం బీజేపీ తీరును గుర్తించాలన్నారు. మనం బిక్షగాళ్లం కాదని, హక్కుదారులమని అన్నారు మంత్రి గంగుల. మనం భారతీయులం కాదా, బారత్లో అంతర్బాగం కాదా, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మాకు వర్తించదా అని కేంద్ర బీజేపీని ప్రశ్నించారు. కానీ ఉద్యమకారుడైన కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు, కేంద్రం మెడలు వంచైనా రైతులు పండించిన వడ్లను కొనిపిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.  దున్నపోతుపై నీళ్ల పడ్డ చందంలా కేంద్రం తీరు ఉందని ప్రత్యక్షంగా చూపెట్టిన తీరు రైతుల్ని ఆలోచింపచేసింది, కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేంద్రాన్ని వరి పంట సేకరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్, సుడా ఛైర్మన్ తో పాటు కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts