YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ధాన్యం కొనకుంటే గద్దె దించుతాం...

ధాన్యం కొనకుంటే గద్దె దించుతాం...

హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెరాస పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. కెసిఆర్  నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతుల అభివృద్ధి కి అండగా నిలిచింది. రైతులకు పంట పెట్టుబడి కోసం 10 వేల ఆర్ధిక సహాయం అందించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది. వరి పంట సాగు చేయాలని రైతులను మాయమాటలు చెప్పిన బిజెపి  నేతలు ఎక్కడికి పోయారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న తెరాస పార్టీని...అంబానీ ఆదానీలకు అమ్ముడుపోయిన బిజెపినేతలు విమర్శించడం సిగ్గు చేటు. పొంతన లేకుండా కేంద్ర, రాష్ట్ర బిజెపి  నేతల తీరు వుంది. రాష్ట్రానికి ఒక విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేయకుండా బాధ్యతల నుండి తప్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... మన వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని తలసాని అన్నారు.

వడ్లు కొనేదాకా వదలం
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్ర వైఖరిని ముందే గమనించిన సీఎం కేసీఆర్ వరి పంటను తగ్గించాలని రైతులకు సూచిస్తే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తాము బాజాప్తా కొనుగోలు చేస్తామని చెప్పి నేడు రైతులను మోసం చేస్తున్నారని  పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.  వరి కొనుగోళ్లలో తెలంగాణ పట్ల  మన ఎంపీలు పార్లమెంట్ లోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని అవహేళన చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేవపెట్టారని...  రైతుల పక్షానా ఇలా అనేక రూపాల్లో  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామని చెప్పారు.
రైతులు పండించిన  ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో సీయం కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారని పేర్కొన్నారు. మార్చిలో తొలి విడుత ఉద్యమ కార్యాచరణ ముగిసిన తర్వాత తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రెండో విడుత ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారని....  అధిస్థానం ఆదేశాల మేరకు మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకో చేశామన్నారు.  శుక్రవారం   ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం,  ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలుపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టాలని సూచించారు.

Related Posts