YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భార‌త్‌, చైనా విష‌యంలో రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భార‌త్‌, చైనా విష‌యంలో రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

న్యూ డిల్లీ ఏప్రిల్ 8
భార‌త్‌, చైనా విష‌యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఎలాగైతే దాడులు చేస్తుందో.. అలాగే భార‌త్‌పై చైనా కూడా దాడులు చేసే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సార్వ‌భౌమ‌త్వాన్ని తాము అంగీక‌రించ‌మ‌ని ర‌ష్యా ప‌దే పదే పేర్కొంద‌ని, అలాగే.. డొనెట్స్్క‌, లుహాన్స‌క్ ప్రాంతాల‌ను కూడా తాము అంగీక‌రించ‌మ‌ని, ఈ కార‌ణంగానే ర‌ష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేసింద‌ని రాహుల్ విశ్లేషించారు. ఈ కార‌ణంతో పాటే ఉక్రెయిన్ నాటో అమెరికా మ‌ధ్య వున్న బంధాన్ని కూడా తెంచాల‌న్న‌ది ర‌ష్యా ప్లాన్ అని పేర్కొన్నారు. అచ్చు ఇలాంటి సిద్ధాంతాన్నే చైనా కూడా భార‌త్ విష‌యంలో అమ‌లు చేయాల‌ని చూస్తోంద‌ని పేర్కొన్నారు.ల‌ద్దాఖ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్రాంతాలు భార‌త్‌లో భాగం కాద‌ని చైనా వాద‌న అని, ఈ ప్రాంతాల్లో చైనా త‌న బ‌ల‌గాల‌ను మోహ‌రించింద‌న్నారు. ఈ విష‌యాన్ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అంత సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని ఆరోపించారు. స‌త్యాల‌ను అంగీక‌రించే మ‌న‌స్త‌త్వం ఈ ప్ర‌భుత్వానికి లేద‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌త్యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, దానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని రాహుల్ హిత‌వు ప‌లికారు. కేంద్రం గ‌న‌క ప‌రిస్థితులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోని ప‌క్షంలో.. ప‌రిస్థితులు మ‌ళ్లీ మారే అవ‌కాశాలున్నాయ‌ని రాహుల్ హెచ్చ‌రించారు.చాలా సంవ‌త్స‌రాలుగా బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను నొక్కి పెడుతున్నాయ‌ని, అవి ఎప్పుడో ఒక‌ప్పుడు బ‌య‌టికి పొక్క‌డం మాత్రం ఖాయ‌మ‌ని రాహుల్ అన్నారు. శ్రీలంక‌లో ఏం జ‌రుగుతుందో అంద‌రూ చూస్తున్నార‌ని, ఇప్పుడు స‌త్యాలు బ‌య‌టికి వ‌చ్చాయ‌న్నారు. అలాగే.. భార‌త్‌లో కూడా జ‌రుగుతుంద‌ని రాహుల్ అన్నారు.

Related Posts