YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

షాంఘైలో ఆకలి కేకలు! లాక్డౌన్తో జనం ఇబ్బందులు

షాంఘైలో ఆకలి కేకలు! లాక్డౌన్తో జనం ఇబ్బందులు

బీజింగ్
కోవిడ్ నేపధ్యంలో షాంఘై నగరంలో విధించిన లాక్ డౌన్ కు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బయటకు రాలేక ఇంటి కిటికలనుంచి నినాదాలు, ఆర్థానాదాలు చేస్తున్నారు. షాంఘైలో దాదాపు 26 మిలియన్ల జనాభా వుంటుంది. తిండి, నీరు, ఇతర నిత్యావసర సరుకులు నిండుకున్నాయని గగ్గోలు పెడుతున్నారు.  ఎలాగోలా బయటకు వెళ్లినా సూపర్ మార్కెట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నయి. పిల్లలు, వృద్ధులకు అవసరమైన మందులు కూడా దొరకట్లేదు. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నయని సిటీలో లాక్డౌన్ పెట్టిన ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు.  ప్రజాగ్రహన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా వైరల్అవుతున్నయి. ఏప్రిల్ 1 నుంచి షాంఘై సిటీలో లాక్డౌన్ విధించారు. ఒమిక్రాన్ వేరియంట్తో అక్కడ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో జీరో కొవిడ్ వ్యూహంలో భాగంగా షాంఘై సిటీతో పాటు చాలాచోట్ల లాక్డౌన్ అమలుచేస్తున్నారు.   షాంఘైలో సామూహిక కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో డాక్టర్లపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ ఓ డాక్టర్ ఐసోలేషన్లోనే కుప్పకూలడంతో మిగతా సిబ్బంది అతన్ని మోసుకెళ్తున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. షాంఘైలోని మొత్తం 2.6 కోట్ల మందికి సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే కరోనా సోకిన తల్లిదండ్రుల నుంచి వారి చిన్నారులను వేరుగా ఉంచుతున్నారు. పేరెంట్స్ను సెపరేట్గా క్వారంటైన్ చేస్తున్నారు.

Related Posts