YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

వేములవాడ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గం ఇంచార్జ్ పులి రాంబాబు గౌడ్ ఆద్వర్యం లో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో కోడె మొక్కు చెల్లించి  కేకు కట్  చేసి సంబరాలు జరుపుకొన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి పులి రాంబాబు గౌడ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తుందని అన్నారు టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలిసేలాచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముంజ ఉమెoదర్ గౌడ్  పట్టణ అధ్యక్షులు ముప్పిడి శ్రీధర్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నందిపేట రమణ    యాదవ్ మండల అధ్యక్షులు రామ స్వామి గౌడ్ గిన్నె రవి వలీ ముహమ్మద్  ఇమ్రాన్ రాహుల్ సాయి రాజు తదితరులు పాల్గొన్నారు

Related Posts